తెలుగు సినిమా ఇండస్ట్రీకి “నచ్చావులే” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి మాధవి లత. ఆ తరువాత నాని సరసన “స్నేహితుడా” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిన ఈమె ఆ తర్వాత మరోసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈమె పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదనే చెప్పవచ్చు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా ఉన్నప్పటికీ ఈమె బిజెపి పార్టీలోకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉండే మాధవి లత నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వివాదం సృష్టిస్తూ నిత్యం వార్తల్లో ఉంటారు.ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు ఇండస్ట్రీలో జరిగిన అవమానాలు గురించి తెలియజేస్తూ బాధపడ్డారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న మాధవి లత స్నేహితుడు సినిమా షూటింగ్ సమయంలో తనని ఘోరంగా అవమానించారని, ఇప్పటికీ ఆ బాధ తనని వెంటాడుతూనే ఉందని తెలిపారు. స్నేహితుడు సినిమా షూటింగ్ జరిగే సమయంలో సెట్లోకి వెళ్లగా అక్కడ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో ఒకతను తనని చాలా అవమానపరచారని తెలియజేశారు.సాధారణంగా సెట్లోకి వెళ్ళినప్పుడు మనం అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పడం సర్వసాధారణం.
ఈ విధంగా సెట్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకతనికి గుడ్ మార్నింగ్ చెబుతూ ఇందాక మిమ్మల్ని పలకరించాను మీరు వినిపించుకోవడం లేదు అనగా..ఓ.. మీరు సెట్ కు వచ్చారా.. నేను చూడలేదండి..మీరు కూడా హీరోగారి మాదిరిగా సొంత కారు కొనుక్కొని వస్తే హీరోయిన్ వచ్చిందని గుర్తు పడతాము. సెట్ కారులో వచ్చారు కదా ఎలా గుర్తు పడతాము. అంటూ తనని అవమానించారని ఇప్పటికీ ఆ మాట గుర్తొచ్చినప్పుడు ఎంతో బాదేస్తుందని ఇంటర్వ్యూ సందర్భంగా మాధవీలత అన్నారు. మనిషికి గుర్తింపు కేవలం కార్లు, బ్రాండ్ లు మాత్రమే కానీ ఆ మనిషికి ఎలాంటి గుర్తింపు లేదా అంటూ బాధపడినట్లు మాధవి లత ఈ సందర్భంగా తెలియజేశారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…