Snigdha : అలా మొదలైంది సినిమాతో సినిమా ప్రయాణం మొదలు పెట్టిన స్నిగ్ధ తాను ఇండస్ట్రీకి సింగర్ కావాలని వచ్చి యాక్టర్ అయింది. నందిని రెడ్డి సినిమాతో అవకాశం అందుకుని మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న స్నిగ్ధ ప్లే బ్యాక్ సింగర్ గా కూడా కొన్ని చిత్రాలలో పాటలు పాడింది. ఇక దాదాపు యాభైకి పైగా సినిమాలో నటించిన స్నిగ్ధ తన వేషధారణ అందరిలా కాకుండా భిన్నంగా ఉండటం వల్ల మరింత గుర్తింపు దక్కించుకుంది. చాలా సింపుల్ గా బతుకుతున్న స్నిగ్ధ తన అవసరాలకు మించి డబ్బు వస్తే ఆ డబ్బును చారిటీకి ఇచ్చేస్తాను అంటూ చెప్తోంది.

నా రెమ్యూనరేషన్ మొదటి నుండీ అంతే…
నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలయింది సినిమాకు స్నిగ్ధ ఎంపిక అయి హీరోయిన్ హీరోకి కామన్ ఫ్రెండ్ గా కనిపించింది. ఆ సినిమా తరువాత చాలా సినిమాల్లో కామెడీ పాత్రలను చేసిన స్నిగ్ధ మొదటి సినిమాకు 30,000 దాకా రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇక ఇప్పటి వరకు ఆ రెమ్యూనరేషన్ అక్కడే ఉందంటూ పెంచలేదంటూ చెప్తోంది.

ఒకవేళ స్క్రిప్ట్ అందులో పాత్ర బాగా నచ్చి సినిమా వాళ్ళు అంత డబ్బు ఇవ్వలేక పోతే తగ్గించుకోడానికి కూడా ఏం ఇబ్బంది లేదంటూ చెబుతోంది. ఒకవైపు మ్యూజిక్ కంపోజ్ చేస్తూనే, ప్లే బావక్ సింగర్ గా కుడా రానిస్తూ మళ్ళీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న స్నిగ్ధ తనకు అవసరాలకు మించి డబ్బు వస్తే ఆ డబ్బును సేవా కార్యక్రమాలకు వాడేస్తానని మనం మాత్రమే కాదు మనతో పాటు మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా బాగుపడాలి అంటూ చెబుతోంది.


































