Snigdha : రాజమండ్రి లో పుట్టి పెరిగిన స్నిగ్ధ టామ్ బాయ్ లా కనిపిస్తు సింగర్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. ‘అలా మొదలయింది’ సినిమాతో సినిమా ప్రయాణం మొదలుపెట్టిన స్నిగ్ధ, ఆ అవకాశం డైరెక్టర్ నందిని రెడ్డి స్నిగ్ధ ను చూసి హీరోయిన్ ఫ్రెండ్ పాత్రకు అడగడంతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత యాభై కి పైగా సినిమాల్లో నటించారు. నటించడం ఇప్పటికీ రాదు అంటూ చెప్పే స్నిగ్ధ తన వేషధారణ అబ్బాయిలా ఉండటం గురించి క్లారిటీ ఇచ్చారు. చిన్నప్పటి నుండీ సింగింగ్ అంటే ఇష్టమున్న స్నిగ్ధ సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా కూడా కొన్ని పాటలను పాడటం విశేషం. ఇక తన జీవితంలో కిరణ్ బేడీ వంటి వారు తనకు ఆదర్శమంటూ చెప్తోన్న స్నిగ్ధ తన వ్యక్తిగత విషయాల గురించి పంచుకున్నారు.

పెళ్లి చేసుకోకపోడానికి కారణం అదే…
అమ్మాయిలా కాకుండా అబ్బాయిలా కనిపించే స్నిగ్ధను చాలా సార్లు అబ్బాయి అనుకోని పొరబడిన వారు ఉన్నారు. అయితే తాను చీరలోనే అదరగొడతాను కానీ నాకు కంఫర్ట్ ఉండే ప్యాంటు షర్ట్ లోనే ఉండాలని అనుకుంటాను. షూటింగ్స్, ఫంక్షన్స్ తప్ప దువ్వెన పెట్టి తల కూడా దువ్వను, చేతితో అలా అనుకోని వెళ్లిపోవడమే చాలా సింపుల్ గా ఉండడం అంటే ఇష్టం అంటూ చెప్తోంది స్నిగ్ధ. ఇక శివుడి మీద అపారమైన భక్తి ఉండటం వల్ల ప్రతి ఏడాది నలభై ఐదు రోజులు దీక్షలో ఉండే స్నిగ్ధ పెళ్లి గురించి ఆలోచన లేదంటూ చెప్పింది. పెళ్లి చేసుకుంటే భర్తకు తరువాత పుట్టే పిల్లకు సమయం కేటాయించి పిల్లలతో సమయం గడపాలి వారిని సమాజానికి ఉపయోగపడేలా పెంచాలి.

కానీ నాకు ఆ సమయం లేదు, నేను నా కెరీర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను. చాలా బిజీగా ఉండటం వల్ల ఒకవేళ పెళ్లి చేసుకున్నా నా పిల్లల్ని చూసుకోలేనేమో అలా వారిని పెంచి సమాజానికి చీడ పురుగులుగా తయారుచేయడం కంటే పెళ్లి అనే ఆలోచన వైపు వెళ్లకుండా నిర్ణయించుకున్నాను. ఎవరైనా సరే పిల్లల్ని బాగా బాధ్యతగా పెంచి వారు ఏం చేస్తున్నారో చూస్తూ మంచి చెడులు నేర్పిస్తే ఓకే గానీ అలా కాకుండా డబ్బు సంపాదనలో పడి పిల్లలకి వారికి కావాల్సింది ఇచ్చి పెంచేసాం అనుకుంటే సమాజానికి చెడు చేసిన వాళ్ళు అవుతారు. చీడపురుగులను తయారు చేసినట్లు అవుతుంది అంటూ అభిప్రాయపడింది.



























