Sobhita Dhulipala: గూడచారి, మేజర్, వంటి సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి శోభిత ధూళిపాళ్ల. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాల్లో కూడా ఈమె కీలక పాత్రలో నటించారు. ఇలా పలు సినిమాలలో నటిస్తూ అతి తక్కువ సమయంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
గత కొన్ని రోజుల క్రితం వరకు ఈమె టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన ఈమె తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.
పెళ్లి దుస్తులలో ఎంతో అందంగా ముస్తాబయి ఓ వ్యక్తి చేతిలో చేయి వేసి ఎంతో అందంగా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా శోభిత ఈ ఫోటోలను షేర్ చేస్తూ వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇలా స్వయంగా పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.
శోభిత పెళ్లి గురించి ఏమాత్రం తెలియజేయకుండా ఇలా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చారంటూ అభిమానులు భావించారు .అయితే ఈమె నిజంగానే పెళ్లి చేసుకోలేదని ఓ పెళ్లికి సంబంధించిన యాడ్ షూట్ లో భాగంగా ఈమె ఇలా పెళ్లికూతురులా ముస్తాబయి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ విషయం తెలియడంతో ఎంతోమంది అభిమానులు పెళ్లయిపోయిందని తెలియగానే ఒక్కసారిగా నా గుండె ఆగినంత పని అయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…