Social Activist Krishna Kumari : రాకేష్ మాస్టర్ కోరియోగ్రాఫర్ గా ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడో చివరి రోజుల్లో అంత దిగజారి పోయారు. తాగుడికి బానిసగా మారి కొంత మంది యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళతో కలిసి హీరోలను తిడుతూ వీడియోలను చేసి మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇక ఆయన మరణం మీద కూడా కొంతమంది కాంట్రవెర్సీలకు తేరలేపి వీడియోలను చేసుకుంటున్నారు. ఇక తాజాగా ఆయన మూడో భార్య అని చెప్పుకునే లక్ష్మమ్మ ను యూట్యూబర్ లల్లీ నడిరోడ్డు మీద చితకబాదింది. దీంతో మరోసారి రాకేష్ మాస్టర్ కి సంబంధించిన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఇష్యూ మీద సామజిక వేత్త కృష్ణ కుమారి మాట్లాడారు.

రాకేష్ మాస్టర్ ను చంపింది వాళ్ళే…
ఒక మనిషి కష్టపడి ఎంత ఎత్తుకు వెళ్ళాడు అలానే ఎంత దిగజారి పోయాడు, దిగజారినప్పుడు ఆయన చుట్టూ చేరే మనుషులు కుడా ఎలాంటి వారు చేరుతారు వంటి విషయాలు రాకేష్ మాస్టర్ జీవితంలో బాగా కనిపిస్తాయి. ఆయన తన టాలెంట్ తో పైకి వచ్చినా చివరకు తాగుడుకు బానిస అవడం వల్ల ఎలా దిగజారిపోయాడో తెలుస్తుంది. ఆయన నుండి లాభం పొందడానికి ఆయనకు తాగించి వీడియోలు చేయించుకుని డబ్బు సంపాదించిన వాళ్ళు ఉన్నారు.

అలా తాగించి తాగించి ఆయనను చంపారు. డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ కొంతమంది యూట్యూబ్ ని ఎంచుకుని అసభ్యకర వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అలానే రాకేష్ మాస్టర్ మద్యానికి బానిస అవడం వల్ల ఆయన చుట్టూ దిగజారిన మనుషులే చేరి ఆయన జీవితాన్ని మరింత నాశనం చేసారు. అందరూ ఆయనను వాడుకుని డబ్బు సంపాదించిన వాళ్ళే, చివరకు అయన మరణించినా ఇంకా ఆయన చావును వాడుకుంటున్నారు అంటూ కృష్ణ కుమారి అభిప్రాయపడ్డారు.