Social Activist Krishna Kumari : నందమూరి తారకరత్న విషయంలో ఎవరూ ఊహించని విషాదం ఆయన కుటుంబాన్ని కమ్మేసింది. నలభై ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించి ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టారు. తారకరత్న గారు సినిమాల్లో అంతగా రానించకపోయినా మంచి వాగ్దాటి ఉండటంతో టీడీపీ లో ఈసారి ఎమ్మెల్యే కి పోటీచేయాలని భావించారు. అయితే ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆయన అందరికీ శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన వ్యక్తగత జీవితంలోనూ ఇప్పుడిప్పుడే తన ప్రేమ వివాహం వల్ల దూరమైన కుటుంబం మళ్ళీ కలుసుకుంటారు అనుకునే సమయానికి ఆయనే శాశ్వతంగా దూరం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అలేఖ్య రెడ్డికి అండగా ఆయన కుటుంబం నిలబడుతుందా అనే చర్చల నడుమ కృష్ణ కుమారి గారు ఈ విషయాల గురించి మాట్లాడారు.

అలేఖ్య నిర్ణయం అదే అయ్యుండాలి…
పుట్టినరోజే చిన కర్మ జరగడంతో మరోసారి తారకరత్న కుటుంబం సభ్యులు తారకరత్నను తలచుకుని బాధపడ్డారు. అయితే అలేఖ్య రెడ్డి జీవితంలో ఒకసారి డివోర్స్ అయితే మరోసారి ఇలా భర్తను కోల్పోవడంతో కోలుకోలేని బాధ ఆమెకు ఎదురైనట్లయింది. కృష్ణ కుమారి గారు మాట్లాడుతూ అలేఖ్య రెడ్డి తల్లిదండ్రులు అలాగే అత్తింటివారు ఇద్దరూ పెద్ధ కుటుంబాల వారు అవ్వడం వల్ల డబ్బు పరంగా వచ్చే ఎటువంటి ఇబ్బందులైనా వాళ్ళు చూసుకుంటారు. ఇక భర్త లేని లోటును ఎవరూ పూపుడ్చలేరు. ఆ పిల్లలకు తండ్రి లేని లోటును ఎవరూ పూడ్చలేరు. ఆ అమ్మాయి ఎంతో దురదృష్టవంతురాలు అంటూ అభిప్రాయపడ్డారు. అయితే ఒక కుటుంబంలో భర్త పోయినా ఆ ఇంటికి ఏ లోటు లేకుండా భార్య అన్ని తానై చూసుకోగలదు అదే ఆ ఇంటి ఆడమనిషి చనిపోతే ఆలోటు ఎవరూ పూడ్చలేరు. అయినా బాగా పేరు పలుకుబడి ఉన్న కుటుంబంలో కష్టం వచ్చిందని అందరూ చర్చించుకోవడం అంత సమంజసం కాదు. ఎంతో మంది ఆర్మీ వాళ్ళు, భవన కార్మికులు వంటి వారు చనిపోతున్నారు.

అలాంటి వాళ్లకు ఎంత భరోసా ఇవ్వగలుగుతున్నారు. కూలి పనిచేసుకునే ఆడవాళ్లు మరణిస్తే ఆ కుటుంబం వీధిన పడుతుంది. ఆ పిల్లల బాధ్యత ఎవరు తీసుకుంటారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాలి కానీ అలేఖ్య రెడ్డి భవిష్యత్తు గురించి కాదు. అందునా అలేఖ్య రెడ్డి మొదటి భర్త నుండి విడాకులు తీసుకున్న తరువాత కూడా చాలా బాగా తన కాళ్ళమీద తాను నిలబడి పనిచేసుకుంటూ పోయింది. ఇక ఇప్పుడు తనని ఎవరూ పట్టించుకోక పోయినా తన పిల్లల కోసం తాను బాధ్యత తీసుకుంటుంది. బాధ్యతలే మనకు దారి చూపుతాయి అది మనిషి సహజ లక్షణం అంటూ కృష్ణ కుమారి అభిప్రాయపడ్డారు. అలేఖ్య రెడ్డి త్వరగా ఈ బాధ నుండి కోలుకుని తన పిల్లలను చూసుకుంటుంది అంటూ చెప్పారు.































