కరోనా ఉదృతి నేపధ్యంలో, లాక్ డౌన్ ఉన్న కాలంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతోమందికి అండగా నిలిచాడు. వేలాది మందికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. ప్రస్తుత సెకండ్ వేవ్ లో కూడా ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు సోనూసూద్.
ఏపీ లోని కర్నూలు మరియు నెల్లూరు జిల్లాల్లో మొట్టమొదటి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో సోనూసూద్ మానవతా హృదయానికి ప్రజలందరూ జేజేలు పలుకుతున్నారు. మరోవైపు సోనూసూద్ అభిమానులు ఆయన కటౌట్‌కు పాలాభిషేకాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పాలను వృధా చేయొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు సోనూసూద్. పాలు అవసరమైన వారి కోసం వాటిని అందజేయాలని, అంతే గానీ ఇలా పాలను వృధా చేయొద్దని తన ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. పాలాభిషేకాలు చేస్తున్న వీడియోలను ట్యాగ్ చేస్తూ పాలను పేదరికంలో ఉన్న వారికి అందజేయాలని సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…