Sonu Sood తెలుగు తమిళ హిందీ భాషలలో ఎన్నో సినిమాలలో విలన్ గా నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న విలక్షల నటుడు సోనోసోద్ గురించి తెలియని వారంటూ ఉండరు. సినిమాలలో విలన్ గా నటించినప్పటికీ నిజజీవితంలో మాత్రం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సోనూ సూద్ ఒక రియల్ హీరో అనిపించుకున్నాడు. ముఖ్యంగా దేశంలో కరోనా విజృంభించిన సమయంలో అందరికీ వైద్యం అంది ఎలా చేయడమే కాకుండా ఆర్థిక స్తోమత లేని పేదలకు ఆర్థిక సహాయం అందించాడు.

అంతేకాకుండా కరోనా సమయంలో విదేశాలలో చిక్కుకున్న ఎంతోమంది విద్యార్థులను సొంత ఖర్చులతో స్వదేశానికి రప్పించి తన మంచి మనసు చాటుకున్నాడు. సోను సూద్ ఒక చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎంతోమంది నిరుపేదలకు సహాయం చేయడమే కాకుండా అనాధలైన ఎంతోమందిని ఆదరించి వారి బాగోగులు చూసుకుంటున్నాడు. అంతేకాకుండా గుండె సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది చిన్నారులకు సొంత డబ్బుతో గుండె ఆపరేషన్లు చేయించి వారికి జీవితాన్ని ప్రసాదించాడు.
ఇలా సోనోసూద్ చేసే మంచి పనుల వల్ల నటుడిగా కన్నా ఒక మంచి మనిషిగా ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ప్రతి ప్రాంతంలోనూ సోనూసూద్ అభిమానులు ఒక టీమ్ గా ఏర్పడి నిరుపేదలకు సహాయం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అయితే ఇటీవల కొంతమంది సోనూసూద్ అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Sonu Sood అభిమానాన్ని చాటుకున్న మధ్యప్రదేశ్ వాసులు…
తాజాగా 2500 కిలోల బియ్యంతో సోనూ సూద్ ఆవిష్కరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కొంతమంది అభిమానులు మధ్యప్రదేశ్లోని దేవాస్ లో ఉన్న తుకోజీ రావు స్టేడియంలో ఒక ఎకరం స్థలంలో నేలమీద ఒక ప్లాస్టిక్ షీట్ పరిచి 2,500 కిలోల బియ్యంతో సోనూ సూదు రూపాన్ని ఆవిష్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Fans in Madhya Pradesh carve #sonusood‘s face using 2500 kilos of rice over one acre land which will be donated to the needy. pic.twitter.com/khVVS0rJ28
— Amit Karn (@amitkarn99) April 11, 2023





























