soundarya: అలనాటి అందాలతార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన అందం సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య అదే పాపులారిటీతో రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.ఈ క్రమంలోనే బిజెపి పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఈమె హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.

ఈమె మరణించి చాలా సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పటికీ అభిమానుల మదిలో చెరగని ముద్రగా ఉండిపోయారు.ఇక ఈ హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె సోదరుడు అమర్ నాథ్ కూడా మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా వీరిద్దరూ మరణించడంతో వీరి కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆస్తిపాస్తుల కోసం పెద్ద ఎత్తున గొడవ పడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే సౌందర్య తల్లి మంజుల భర్త రఘు ఒక వైపు ఉండగా.. సౌందర్య సోదరుడు అమర్ భార్య మరోవైపు ఆస్తి కోసం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి 2 ఇండ్లు ఉండగా ఒకటి సౌందర్య, ఆమె సోదరుడు పేరు పై రాసి ఉండగా, మరొకటి అమర్ నాథ్ కుమారుడు సాత్విక్ పేరు పై ఉన్నట్లు సమాచారం.ఇకపోతే వీటితో పాటు హైదరాబాద్లో కొన్ని విలువైన ఆస్తిపాస్తులు ఉన్నట్లు సమాచారం.
కోర్టు మెట్లెక్కిన కుటుంబం..
ఈ ఆస్తి కోసం సౌందర్య కుటుంబ సభ్యులు ఏకంగా కోర్టు మెట్లు కూడా ఎక్కారు. సౌందర్య సోదరుడు అమర్ నాథ్ భార్య తన కొడుకు ఆస్తిపాస్తులు సౌందర్య తల్లికి, భర్తకు దక్కకుండా కోర్టులో పిటిషన్ వేశారు.ఈ క్రమంలోనే విచారణ జరిపిన కోర్టు పలు ప్రశ్నలు వేయగ సౌందర్య తల్లి, భర్త దగ్గర సరైన సమాధానాలు లేకపోగా ఆస్తి మొత్తం సౌందర్య మేనల్లుడు సాత్విక్ కి అప్పగించినట్లు తెలుస్తోంది.




























