Soundarya : తెలుగు సినిమా పరిశ్రమలో సావిత్రి తరువాత గొప్ప నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే ఆమె సౌందర్యనే. అమ్మోరు సినిమా నుండి షవేతనాగు సినిమా వరకు ప్రతి సినిమాలోనూ తన అద్భుతమైన నటనతో ఎంతో మందిని అభిమానులుగా చేసుకున్న సౌందర్య అందరు టాప్ హీరోల సరసన నటించింది. వెంకటేష్ కి హిట్ పెయిర్ గా నిలిచిన సౌందర్య చిరంజీవి, నాగార్జున తో కూడా మంచి హిట్లు కొట్టింది. అయితే బాలకృష్ణ సరసన మాత్రం సినిమాలను చాలా తక్కువ చేసింది. అయితే బాలయ్య బాబుతో నటించే అవకాశం మళ్ళీ వచ్చినా సౌందర్య రిజెక్ట్ చేసింది.

చెన్న కేశవ రెడ్డి సినిమాలో నటించడానికి ఒప్పుకోని సౌందర్య…
బాలకృష్ణ, వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యపు సినిమా చెన్నకేశవ రెడ్డి. ఈ సినిమా చిరంజీవి ఇంద్ర సినిమా సమయంలో విడుదల బాక్స్ ఆఫీస్ వద్స్ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకున్నా బాలకృష్ణ కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోయింది. సినిమా హిట్ అవ్వకపోయినా యాంటీ ఫ్యాన్స్ కి కూడా నచ్చినబాలయ్య సినిమాగా నిలిచింది. అలాంటి సినిమాలో పెద్ద బాలకృష్ణ కి జోడిగా నటించేందుకు సౌందర్య ను బెంగళూరు వెళ్లి వినాయక్ సంప్రదించగా కథ విన్నాక సౌందర్య చేయను అని చెప్పారట.

ఇంకా కెరీర్ బాగున్నపుడే హీరో కి తల్లి పాత్రలో చేస్తే నెక్స్ట్ అన్ని అలాంటి పాత్రలే వస్తాయనే ఉదేశ్యం తో రిజెక్ట్ చేశారట. వినాయక్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రోజుల్లో, సౌందర్య నటించిన ఒక నాలుగు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. అలా ఆ పరిచయంతోనే అడిగాడట కానీ ఆమె రిజెక్ట్ చేయడంతో బాలీవుడ్ బ్యూటీ టబు ని సంప్రదించి కథ వినిపించగా ఓకే చేసారు. అలా పెద్ద బాలకృష్ణ కి జోడిగా టబు, చిన్న బాలకృష్ణ కి జోడిగా అప్పుడు టాప్ హీరోయిన్ గా ఉన్నా శ్రేయ ని తీసుకున్నారు.



























