UP Elections: ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ బరిలో సౌత్ సన్నీలియోన్..! గ్లామర్ డోస్ కోసమేనా..?
UP Elections: త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగున్న సంగతి తెలిసిందే. 2024లో జరిగే ఎంపీ ఎన్నికలకు ఇది సెమీ ఫైనల్ లాంటిది అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. అందరి చూపు మాత్రం కేవలం యూపీపైనే పడింది. ఇప్పటికే యూపీలో 403 స్థానాల్లో పోటీ చేయాడానికి కాంగ్రెస్ 125మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
దీనిలో 50 మంది మహిళలు ఉన్నారు. అందులో తమిళ నటి అర్చన గౌతమ్ కూడా ఉన్నారు. ఆమె మీరట్ జిల్లాలోని హస్తినాపూర్ స్థానం నుంచి కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేయడం ద్వారా రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికలకు గ్లామర్ ను జోడించనున్నారు.
అయితే ఆమె 2021 నవంబర్ లో కాంగ్రెస్ లో చేరారు. ఇలా పార్టీలో చేరి రెండు నెలలు కాకముందే కాంగ్రెస్ టికెట్ ను కొట్టేయడం విశేషం. అయితే నవంబర్ లోనే ఆమె పార్టీలో రెండు సార్లు చేరింది. లక్నోలో జరిగిన సమావేశంలో ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ తివారీ ఆధ్వర్యంలో ఆమె పలువురితో కలిసి పార్టీలో చేరింది. కాని అ సమయంలో గుంపులో గోవిందలాగా మారిందని.. ఆ రోజు తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది.
ప్రియాంక గాంధీ వాద్రా ఆమెను పార్టీ చేర్చుకోవాలని భావించారని.. కానీ అది జరగకపోవడంతో ఆమె నిరాశకు లోనయ్యారని అమె తండ్రి చెప్పాడు. ఇలా ఆమె అసంతృప్తిని తెలియజేసిన తర్వాత, మరుసటి రోజు అంటే నవంబర్ 27న భూపేష్ బఘేల్ అతడు బస చేసిన హోటల్ లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి.. ఆమెను పార్టీలోకి ఆహ్వానించాడు. అర్చన గౌతమ్ మీరట్ జిల్లాకు చెందినవారు . తమిళ నటి అయిన ఈమెను సౌత్ సన్నీ లియోన్ అని కూడా పిలుస్తారు. ఆమె ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండి.. తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంది. తర్వాత మళ్లీ గత సంవత్సరం నవంబర్ లో చేరింది.
ఇలా ఆమెను తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భూపేష్ బఘేల్ కీలక పాత్ర పోషించారు. ఆమె మీరట్లోని ఐఐఎంటీలో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ చేశారు. ఆ తర్వాత మోడలింగ్ మరియు నటనలో కెరీర్ ప్రారంభించింది. ఆమె 2014లో మిస్ ఉత్తరప్రదేశ్ టైటిల్‌ను గెలుచుకుంది. నాలుగేళ్ల తర్వాత 2018లో మిస్ బికినీ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. 2018లో మిస్ కాస్మోస్ ఇండియా టైటిల్ కూడా ఆమె సొంతం చేసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…