Categories: Featured

Sr. NTR: ఎన్టీఆర్ తో పరిచయం… ఆ కమెడియన్ దశ మార్చేసిన సీనియర్ ఎన్టీఆర్?

Sr. NTR: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ అప్పటికి ఎంతోమంది కమెడియన్లు ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.ఇలా సీనియర్ కమెడియన్లలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కమెడియన్ రమణారెడ్డి గురించి ఈ తరం వారికి తెలియకపోయినా నిన్నటి తరం వారికి ఈయన ఎంతో సుపరిచితం.

ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎస్వీఆర్ వంటి ఎంతోమంది హీరోల సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ తన హావభావాలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్నటువంటి రమణారెడ్డి ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ ఈయన రెమ్యూనరేషన్ మాత్రం చాలా తక్కువగా తీసుకునేవారట. ఇలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడానికి ఓ కారణం ఉంది.

ఈయన ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే తనకు అవకాశాలు రావేమోనన్న భయంతో తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుని ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండేవారు.అయితే ఈయన పెద్దగా ఆడంబరాలకు పోకుండా ఉన్నదానిలోనే ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవించేవారు. ఇకపోతే రమణారెడ్డితో ఎన్టీఆర్ కి అయినటువంటి పరిచయం ఆయన జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి.

Sr. NTR: ఎన్టీఆర్ తో పరిచయం పెరిగిన రెమ్యూనరేషన్…

ఎన్టీఆర్ రమణారెడ్డి కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్ కావడంతో వీరిద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది.ఈ క్రమంలోనే ఉదయం లొకేషన్ లోకి వచ్చినప్పటి నుంచి ఏ మాత్రం విరామం దొరికిన వీరిద్దరూ ముచ్చట్లు పెట్టుకునేవారు. ఎన్టీఆర్ తో పరిచయం ఏర్పడిన తర్వాత రమణారెడ్డి రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెరిగిపోయింది.ఇలా ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే ఈయన ఏకంగా మద్రాస్ లో ఇంటిని కూడా నిర్మించి ఆర్థికంగా స్థిరపడ్డారు. ఇక రమణారెడ్డి ఎక్కువగా కాఫీలు టీలు తాగకుండా కేవలం పొగాకు మాత్రమే పీల్చే వారు. ఇలా ఇండస్ట్రీలో ఈయనకు పొగాకు పీల్చే కమెడియన్ అనే పేరు కూడా ఉంది. మొత్తానికి ఎన్టీఆర్ తో ఏర్పడినటువంటి పరిచయం వల్ల కమెడియన్ రమణారెడ్డి సుడి తిరిగి పోయిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago