Sree Vishnu : చిన్న చిన్న పాత్రలతో తన నటనా ప్రస్తానాన్ని మొదలుపెట్టి హీరోగా అభిమానులలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట బాణం, సోలో సినిమాలలో చిన్న పాత్రలలో కనిపించాడు శ్రీ విష్ణు. తరువాత 2013 లో ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో రాయాల్ రాజు పాత్రలో అభిమానిలను అలరించాడు. 2016 సంవత్సరంలో ‘అప్పట్లో ఒకడు వుండే వాడు’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మెప్పించాడు. ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాతో అభిమానులకు మరింత చేరువ అయ్యాడు. తనదైన నటనతో ముందుకు సాగుతున్నాడు శ్రీ విష్ణు. తాజాగా శ్రీ విష్ణు గురించి ఒక వార్త అభిమానులను కలవరపెడుతోంది.

తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీ విష్ణు…
ప్రస్థుతం యువ కథానాయకుడు అయిన శ్రీ విష్ణు ఆసుపత్రిలో చికిత్స పండుతున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీ విష్ణు డెంగ్యూ తో బాధ పడ్డారట. అయితే మొదట ఇంటిదగ్గర నుండే చికిత్స తీసున్నారు. కాకపోతే ప్లేట్ లెట్స్ సంఖ్య బాగా పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు దారి తీసింది. దాంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన హైదరాబాద్ లోని ప్రముఖ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం వైద్యుల సమక్షంలో చికిత్స పొందుతున్నాడు.

అయితే శ్రీ విష్ణు ఆసుపత్రిలో చేరడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కలవర పడుతున్నారు. ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు ‘అల్లూరి’ అనే సినిమాలో నటిస్తున్నారు. నిజాయితీకి మారు పేరు అనే ఉప శీర్షిక తో వస్తున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. శ్రీ విష్ణు కోలుకొని త్వరగా ఆసుపత్రి నుంచి రావాలని కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.

































