Sreeja : మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమకు ఇపుడు పెద్ద దిక్కు, అలాగే ఇండస్ట్రీ లో పెద్ద కుటుంబం, అందరి చూపు వాళ్ళ కుటుంబం పై ఉంటుంది. ఈ మధ్యనే ఉపాసన కామినేని పిల్లలు కనడం గురించి ఈ మధ్యనే సద్గురు దగ్గర మాట్లాడి విమర్శలపాలైంది. ఆ ఇష్యూ సద్ధుమణిగిందో లేదో ఇపుడు చిరంజీవి చిన్న కూతురు విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితమే ఈ వార్తలు వినిపించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇపుడు మళ్ళీ ఆ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మూడో పెళ్లి చేసుకుని ఆయన పరువు తీయొద్దు…
చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ మొదటి వివాహం ప్రేమించి ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా చేసుకుని చిరంజీవిగారికి చాలా ఇబ్బందులు పెట్టింది. ఇక ఒక పాప పుట్టాక భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తరువాత మళ్ళీ కొన్నేళ్లకు పెద్దలు చూసిన పెళ్లి చేసుకుంది. చాలా గ్రాండ్ గా చేసుకున్న ఈ పెళ్లి కూడా ఇపుడు పెటాకులు అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రోజుల క్రితమే శ్రీజ తన పేరు పక్కన భర్త పేరును సోషల్ మీడియాలో తీసేసి ఈ పుకార్లకు బలం ఇచ్చింది. దీంతో శ్రీజ విడాకులు తీసుకొని మరో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీటిపై సీనియర్ నటి పూజిత స్పందించారు. చిరంజీవి గారు చాలా పెద్ద వ్యక్తి, ఆయన కూతురు ఇలా మూడో పెళ్లి చేసుకుని ఆయన పరువు తీయకూడదు అంటూ చెప్పింది. చాలా గారంగా పెరగడం వల్ల శ్రీజ ఎవరితోనూ అడ్జస్ట్ కావడం లేదు అంటూ అన్నారు.
వాళ్ళ కుటుంబ విషయాలు నాకు అంతంగా తెలియవు కాబట్టి నేను ఇంతవరకే మాట్లాడగలను కానీ వాళ్ళ నాన్న పరువు గురించి అలోచించి చేసుకోకపోవడం మంచిది. మళ్ళీ మూడో పెళ్ళిలో కూడా విఫలమైతే పరిస్థితి ఏంటి అంటూ మాట్లాడారు. అయితే సీనియర్ నటుడు నరేష్ విషయంలో పెళ్లి గురించి అలా మాట్లాడి శ్రీజ విషయంలో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అనే ప్రశ్నకు పూజిత నరేష్ విషయంలో ఆయన వద్దనుకోలేదు, ఆయన విడాకులు ఇవ్వడం లేదు ఆమె వెళ్ళిపోయింది, ఆయన నాకు ఒక తోడు కావాలి ఈ వయసులో అంటూ క్లారిటీగా చెబుతున్నారు అంటూ పూజిత స్పందించింది.
































