Srikanth : తెలుగు హీరోలలో ఫ్యామిలీ ఇమేజ్ తో అటు సపోర్టింగ్ కారెక్టర్స్ తోనూ మెప్పించిన హీరో శ్రీకాంత్. సోలో హీరోగా సందడి చేసినా మల్టీ స్టార్రర్ చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే సినిమాలను శ్రీకాంత్ చేసారు. ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ అనే సినిమాతో సినిమాల్లోకి వచ్చిన శ్రీకాంత్ మొదట చిన్న చిన్న పాత్రలు చేసారు. ఇక విలన్ పాత్రలు చేస్తూ వచ్చిన శ్రీకాంత్ ‘వన్ బై టూ’ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలు పెట్టాడు. ఇక హీరోగా తాళి, కన్యాధానం, ఆమె వంటి సినిమాలతో నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘పెళ్లి సందడి’ సినిమాతో అమ్మాయిల ఫేవరెట్ హీరో అయిపోయాడు. ‘ఆమె’ సినిమా సమయలో కలిసి నటించిన హీరోయిన్ ఊహ ను పెళ్లి చేసుకున్నారు శ్రీకాంత్.

పెళ్ళైన ఐదో రోజే ఆపరేషన్ థియేటర్లో…
‘తాళి’ సినిమా సమయంలో పరిగెత్తేటపుడు పడి పోయి నా కాలు ఫ్రాక్చర్ అయితే చిన్నదే లే అని నిర్లక్ష్యం చేశాను. హాస్పిటల్ కి వెళ్లినా కొంచెం విశ్రాంతి తీసుకోమని చెప్పడం తో ఆ దెబ్బను పెద్దగా పట్టించుకోలేదు. కాలు బాగా వాపు వచ్చినా కట్టుకట్టుకుని సినిమా షూటింగ్లలో పాల్గొనేవాడిని అంటూ చెప్పారు. ఇక ప్రేమించి ఊహను పెళ్లి చేసుకున్న శ్రీకాంత్ ఆ సమయంలో బిజీ ఆర్టిస్ట్ కావడంతో పెళ్లి కి పెట్టుకున్న సెలవుల్లో హాస్పిటల్ కి కాలు చూపించుకోడానికి వెళ్ళాను. అప్పటికే బాగా నొప్పి ఎక్కువ అవ్వడంతో హాస్పిటల్ కి వెళ్ళాను.

కాలు ఇక పనికి రాదనే పరిస్థితి వచ్చింది. నా నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. పెళ్ళయ్యాక ఐదో రోజే చెన్నై హాస్పిటల్ లో ఆపరేషన్ చేయించుకున్నాను. నడవగలనో లేదో చెప్పలేమని డాక్టర్లు చెప్పేసారు. లోపల బాగా చితికిపోయి ఉండడంతో కష్టం అని చెప్పారు. అయితే నా ధైర్యం నన్ను కాపాడింది. నేను మామూలుగా బయటికి వస్తాను అనుకున్నాను, వచ్చాను అంతే అంటూ శ్రీకాంత్ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.































