తనకు ఏమాత్రం సమయం దొరికిన సినీ పెద్దల పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించే శ్రీ రెడ్డి తాజాగా మరోసారి సినీపెద్దల పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం సినిమా పెద్దలపై మాత్రమే కాకుండా రాజకీయ నాయకులపై, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై, సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా కరోనా సమయంలో మధ్యతరగతి కుటుంబ ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ వారిని ఆదుకోవడానికి సెలబ్రిటీలు రియల్ ఎస్టేట్ లు తమవంతు ఆర్థిక సహాయం చేయాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

తమిళనాడులో ఎంతో స్టార్ హీరోలుగా గుర్తింపు సంపాదించుకున్న అజిత్, విజయ్, సూర్య, రజనీకాంత్ వంటి తదితర హీరోలందరూ సీఎం సహాయనిధికి కోట్ల రూపాయల విరాళాలు ప్రకటిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సెలబ్రిటీల అందరూ ఎక్కడికి పోయారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జనాలు సినిమాలు చూడటం వల్లే మీరు ఇన్ని ఆస్తులు కూడా పెట్టారు. వాళ్ల వల్ల ఆస్తులు పోగు చేసుకున్న మీరు వారు ఆపదలో ఉన్న సమయంలో వాటిని ఖర్చు చేయడానికి మీకు ఏంటి ప్రాబ్లం?వెంటనే డబ్బులు తీసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి పంపించాలని ఘాటుగా స్పందించారు.
సినిమా సెలబ్రిటీలు,రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో పెట్టుబడులు వ్యాపారాలు చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తున్నారు కదా.మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటూ ఆమె నిలదీశారు. కేవలం మీ కుటుంబ సభ్యులు మీరు ఆనందంగా ఉంటే చాలా మధ్యతరగతి కుటుంబ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా అంటూ ఆమె స్పందించారు.
ప్రస్తుతమున్న కష్టాలలో నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను అంతే కానీ ముందు నువ్వు ఏం సహాయం చేస్తున్నావు చెప్పు అని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు అంటూ శ్రీ రెడ్డి ముగించారు. ప్రస్తుతం సినిమా సెలెబ్రిటీల పై శ్రీ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




























