ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో రష్మిక… శ్రీవల్లి పాత్రలో నటిస్తుంది. పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రెండుభాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అంతక ముందు వచ్చిన మూవీ అల వైకుంఠపురం మ్యూజికల్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందులో ఏ సాంగ్ చూసినా.. యూట్యూబ్ లో మిలియన్ల కొద్ది వ్యూస్ ను సంపాదించుకున్నాయి.
తర్వాత వస్తున్న పుష్ఫ సినిమాలో ఓ సాంగ్ రిలీజ్ అయింది. అదే దాక్కో దాక్కో సాంగ్. ఐదు భాషలో విడుదలైన ఈ పాట కూడా పెద్ద హిట్ అయింది. మళ్లీ రెండో సాంగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి హింట్ కూడా ఇచ్చారు దేవీశ్రీప్రసాద్. సోమవారం ఆ సాంగ్ కు సంబంధించి కొన్ని పదాలను సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. దానిని అధికారికంగా ఈ రోజు ఈ పాటకి సంబంధించిన వీడియోని 19 సెకన్ల ప్రోమోగా వదిలారు.
‘చూపే బంగారమాయనే శ్రీవల్లి’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది. ఫుల్ సాంగ్ ను రేపు ఉదయం అనగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. ఈ పాటను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సిద్ శ్రీరామ్ ఆలపించగా.. హిందీలో జావేద్ అలి పాడారు. చంద్రబోస్ పాటకు సాహిత్యం అందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…