Stars Remuneration for shows : ఒకపుడు హీరోలంటే కేవలం సినిమాల్లోనే చూసేవాళ్ళం, కొంతమంది హీరోలు కమర్షియల్ యాడ్స్ కి వస్తారు కాబట్టి టీవిలో కనిపించేవారు. ఇక ఎపుడైనా వాళ్ళ ఇంటర్వ్యూలు అలా ప్రసారమయ్యేవి. ఇపుడు రోజులు మారిపోయాయి, ఎంతటి హీరోలైనా సెలబ్రిటీలైనా నిరంతరం వారి అభిమానులకు టచ్ లో ఉండాలని అనుకుంటున్నారు. ఇక ఒక సక్సెస్ ఫుల్ సెలబ్రిటీ టీవీ తెర మీద కనిపిస్తే ఆ ప్రోగ్రామ్ హిట్ అవుతుంది అని భావించి వాళ్ళ డిమాండ్ ను బట్టి రెమ్యూనరేషన్ ఇచ్చి హోస్ట్ గా సెలబ్రిటీలను తీసుకుంటున్నారు టీవీ యాజమాన్యం. ఇక కోవిడ్ తర్వాత ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ హవా కొనసాగుతోంది. ఇంటర్నెట్ వినియోగం పెరగడం వల్ల ప్రేక్షకులు ఓటీటీ లో ప్రసారమయ్యే షోలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మన తారల రెమ్యూనరేషన్స్ ఎంతంటే…
ఇక ఓటీటీ అలాగే టీవీ షోలలో కనువిందు చేస్తున్న మన సెలబ్రిటీల రెమ్యూనరేషన్స్ కూడా అంతే ఫ్యాన్సీ గా ఉంటున్నాయి. మొదటగా రెమ్యూనరేషన్ లో చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి చిరు 9 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు కోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా దాదాపు 7 కోట్ల పారితోషకం తీసుకున్నాడు. ఇక బిగ్ బాస్ కోసం నాగార్జున ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక బాలయ్య ఓటీటి లో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కోసం దాదాపు సీజన్ కి ఐదు కోట్లు తీసుకుంటున్నారు.

ఇక సమంత సామ్ జామ్ కోసం సీజన్ కి ఒకటి నుండి రెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఇక మాస్టర్ చెఫ్ కి హోస్ట్ గా తలుక్కున మెరిసిన తమన్నా మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక జబర్దస్త్ కోసం ఒక ఎపిసోడ్ కి రోజా రెండు నుండి మూడు లక్షలు తీసుకుంది. ఇక ఆలీ తో సరదాగా షో కోసం ఆలీ ఒక ఎపిసోడ్ కి రెండు నుండి మూడు లక్షలు తీసుకుంటున్నారు. ఇక సాయి కుమార్ గారు ఈటీవీ లో వచ్చే వావ్ షో కోసం దాదాపు ఒకటి నుండి రెండు లక్షల వరకు ఒక ఎపిసోడ్ కి తీసుకుంటున్నారు. ఇలా మన తారలు సినిమాలే కాకుండా ఇలా షోలో చేసి రెండు చేతులా సంపాదిస్తున్నారు.






























