Health News

అధిక ఉప్పుతో మెదడుకు తప్పదు ముప్పు..!

మనం తినే ప్రతి వంటలో కూడా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పులేని వంటకం అసలు రుచే ఉండదు. అయితే కొంత మంది మాత్రం కొన్ని వంటకాలలో ఉప్పును ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఉప్పుని తగిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా జార్జియా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని విషయాలు తెలిశాయి. న్యూరాన్ మెదడులోని లోతైన రక్తప్రవాహానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ అధ్యయనం జరిగింది. ఉప్పు వల్ల మెదడు ప్రభావితం అవుతుంది అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూరాన్ లు యాక్టివ్ గా ఉన్నప్పుడు మెదడులో రక్త ప్రవాహం వేగం పెరుగుతుంది. ఈ సంబంధాన్ని న్యూరోవాస్కులర్ కప్లింగ్ లేదా ఫంక్షనల్ హైపెరెమియా అని అంటారు. ఇది ఆర్టెరియోల్స్ అని పిలువబడే మెదడులోని రక్త నాళాల విస్తరణ వల్ల ఏర్పడుతుంది. ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోర్స్ ఇమేజింగ్ అనేది న్యూరోవాస్కులర్ కప్లింగ్ ఫై ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా వైద్యులు మెదడు సంబంధిత వ్యాధులను నిర్ధారించడానికి బలహీనమైన రక్త ప్రవాహం గల ప్రాంతాలను గమనిస్తారు.

ఇక జార్జియాలోని న్యూరోసైన్స్ ప్రొఫెసర్, యూనివర్సిటీ సెంటర్ ఫర్ న్యూరోఇన్‌ఫ్లమేషన్ అండ్ కార్డియోమెటబాలిక్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ జేవియర్ స్టెర్న్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు సంయుక్తంగా సర్జికల్ టెక్నిక్స్ విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఆహారం తిసుకొనేప్పుడు, మద్యపానం, శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు, పునరుత్పత్తి సమయంలో మెదడులోని లోతైన ప్రాంతమైన హైపోథాలమస్‌‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేసింది.

ముఖ్యంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపోథాలమస్‌లో రక్త ప్రవాహం ఎలా మారుతుందనేది పరిశీలించింది.ఈ అధ్యయనం గురించి డాక్టర్ జేవియర్ స్టెర్న్ వివరిస్తూ..శరీరంలో ఉప్పు స్థాయిలను చాలా ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ స్టడీలో ఉప్పును ఎంచుకున్నాం..మీ రక్తంలో ఎంత ఉప్పు ఉందో గుర్తించే నిర్దిష్ట వ్యవస్థ కూడా మా వద్ద ఉంది. ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మెదడు దానిని గ్రహించి, సోడియం స్థాయిలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఉప్పు వాసోప్రెసిస్ అనే యాంటీడియురేటిక్ హార్మో్న్ విడుదలను ప్రేరేపించే న్యూరాన్‌లను యాక్టీవ్ చేస్తుంది. హైపోథాలమస్‌లో న్యూరాన్లు యాక్టీవ్ కావడం వల్ల రక్త ప్రవాహం తగ్గినట్లు గమనించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago