మనం తినే ప్రతి వంటలో కూడా ఉప్పు ఉండాల్సిందే. ఉప్పులేని వంటకం అసలు రుచే ఉండదు. అయితే కొంత మంది మాత్రం కొన్ని వంటకాలలో ఉప్పును ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఉప్పుని తగిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా జార్జియా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని విషయాలు తెలిశాయి. న్యూరాన్ మెదడులోని లోతైన రక్తప్రవాహానికి మధ్య ఉన్న సంబంధం గురించి ఈ అధ్యయనం జరిగింది. ఉప్పు వల్ల మెదడు ప్రభావితం అవుతుంది అంటున్నారు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూరాన్ లు యాక్టివ్ గా ఉన్నప్పుడు మెదడులో రక్త ప్రవాహం వేగం పెరుగుతుంది. ఈ సంబంధాన్ని న్యూరోవాస్కులర్ కప్లింగ్ లేదా ఫంక్షనల్ హైపెరెమియా అని అంటారు. ఇది ఆర్టెరియోల్స్ అని పిలువబడే మెదడులోని రక్త నాళాల విస్తరణ వల్ల ఏర్పడుతుంది. ఫంక్షనల్ మాగ్నెటిక్ రిసోర్స్ ఇమేజింగ్ అనేది న్యూరోవాస్కులర్ కప్లింగ్ ఫై ఆధారపడి ఉంటుంది. దీని ద్వారా వైద్యులు మెదడు సంబంధిత వ్యాధులను నిర్ధారించడానికి బలహీనమైన రక్త ప్రవాహం గల ప్రాంతాలను గమనిస్తారు.
ఇక జార్జియాలోని న్యూరోసైన్స్ ప్రొఫెసర్, యూనివర్సిటీ సెంటర్ ఫర్ న్యూరోఇన్‌ఫ్లమేషన్ అండ్ కార్డియోమెటబాలిక్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ జేవియర్ స్టెర్న్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు సంయుక్తంగా సర్జికల్ టెక్నిక్స్ విధానాన్ని అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఆహారం తిసుకొనేప్పుడు, మద్యపానం, శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు, పునరుత్పత్తి సమయంలో మెదడులోని లోతైన ప్రాంతమైన హైపోథాలమస్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకొనే ప్రయత్నం చేసింది.
ముఖ్యంగా ఉప్పు తీసుకోవడం వల్ల హైపోథాలమస్‌లో రక్త ప్రవాహం ఎలా మారుతుందనేది పరిశీలించింది.ఈ అధ్యయనం గురించి డాక్టర్ జేవియర్ స్టెర్న్ వివరిస్తూ..శరీరంలో ఉప్పు స్థాయిలను చాలా ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ స్టడీలో ఉప్పును ఎంచుకున్నాం..మీ రక్తంలో ఎంత ఉప్పు ఉందో గుర్తించే నిర్దిష్ట వ్యవస్థ కూడా మా వద్ద ఉంది. ఉప్పగా ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడు, మెదడు దానిని గ్రహించి, సోడియం స్థాయిలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఉప్పు వాసోప్రెసిస్ అనే యాంటీడియురేటిక్ హార్మో్న్ విడుదలను ప్రేరేపించే న్యూరాన్‌లను యాక్టీవ్ చేస్తుంది. హైపోథాలమస్‌లో న్యూరాన్లు యాక్టీవ్ కావడం వల్ల రక్త ప్రవాహం తగ్గినట్లు గమనించారు.


































