తమన్నా భాటియా ఈ పేరు వినగానే ముందుగా టక్కున గుర్తుకు వచ్చేది తన మిల్కీ అందం. తమన్నా తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల మనసులను దోచుకుంది.50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా.
తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది తమన్నా. ఈ మధ్య కాలంలో తమన్నా సినిమాలు,వెబ్ సిరీస్ అని తేడా లేకుండా వరుసగా నటిస్తూ దూసుకుపోతోంది.ఇటీవలె ఆమె సీటిమార్ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇందులో గోపీచంద్ హీరోగా నటించాడు.
ఇది ఇలా ఉంటే టాలీవుడ్ హీరో బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమాకి మొదట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.కానీ అప్పట్లో కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా చేయలేనని చెప్పిందట. దాంతో శ్రుతిహాసన్ తో ఉన్న పరిచయం కారణంగా, గోపీచంద్ ఆమెను ఒప్పించాడని అంటున్నారు.
అలా బాలయ్య సినిమాలో శ్రుతిహాసన్ ఎంట్రీ ఖరారైపోయింది. అయితే ప్రస్తుతం శ్రుతిహాసన్ ప్రభాస్ సరసన నాయికగా సలార్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు చిరంజీవి భోళా శంకర్ సినిమా కోసం ముందుగా శ్రుతిని అడిగితే, వాళ్లు అడిగిన డేట్లు ఖాళీ లేని కారణంగా ఆమె చేయలేనని చెప్పిందట. ఆమె నో చెప్పిన తరువాతనే తమన్నాను ఎంపిక చేశారట. అలా ఒకరు నో చెప్పిన సినిమాకి మరొకరు ఎస్ చెప్పారన్న మాట.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…