Suddhala Ashok Tej : పాటల రచయితగా ఎన్నో పాటలు రాసిన సుద్దాల అశోక్ తేజ గారు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. తెలంగాణ విప్లవ గీతాలతో మొదలు సినిమా రొమాంటిక్ సాంగ్స్ వరకూ అన్నింటినీ రాయగల నేర్పరి ఆయన. ఇక ఆయన రాసిన ‘ఠాగూర్’ చిత్రంలోని ‘నేను సైతం ప్రపంచానికి’ పాటకు నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. సుద్దాల గారు మొదట ప్రభుత్వ టీచర్ గా పనిచేస్తూ కవిగా రచనలను సాగించేవారు. నటుడు ఉత్తేజ్ గారు ఆయనకు మేనల్లుడు అవడం అప్పటికే సినిమాల్లో ఉన్న ఉత్తేజ్ గారి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే మొదట్లో సినిమా అవకాశాలు ఎలా వచ్చాయి, ఆయన పడిన ఇబ్బందులను గురించి సుద్దాల వివరించారు.

శ్రమ దోపిడీ అన్నిచోట్లా ఉంది…
మొదట్లో అవకాశాలు రావడమే ఎక్కువ అన్న పరిస్థితిలో చాలా మంది సినిమాలకు రాయించుకుని కేవలం భోజనం పెట్టి ఊరు వెళ్ళడానికి దారి ఖర్చులు ఇస్తామని చెప్పేవారట. మరికొంతంది డబ్బు ఇస్తాము కానీ సినిమాలో నీ పేరు బదులు వేరేవారి పేరు వేస్తాం అని చెప్పేవారట. అలా వద్దు నా పేరే వేయండి కావాలంటే డబ్బు ఇవ్వద్దు అని చెప్పేవారట సుద్దాల గారు.

అలా కొన్నేళ్లు డబ్బు సరిగా ఇవ్వకపోవడం లేదా మీకు పనికి తిండి పెట్టడం ఎక్కువ అన్నట్లుగా మాట్లాడేవారు అంటూ చెప్పారు. కానీ నేను కోల్పోయిన దాని కంటే సక్సెస్ అయ్యాక ఎక్కువ డబ్బు సంపాదించుకున్నాను అంటూ చెప్పారు. శ్రమ దోపిడీ అన్నిచోట్లా ఉందని, డైరెక్టర్ నిర్మాత ఒక ఆర్టిస్ట్ అందరూ శ్రమ దోపిడీ కి గురవుతున్నారు, ఏదో ఒక సందర్భంలో అవుతుంటారు అంటూ చెప్పారు.





























