Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. జబర్థస్త్ షో ద్వారా ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. ఢీ వంటి షోలు చేస్తూ తన యాక్టింగ్, డ్యాన్స్ లతో అదరగొడుతున్నాడు. సుడిగాలి సుధీర్ టీం ద్వారా ఎనలేని ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.

తన స్పాంటెనియస్ పంచులతో, తన నటనతో ఎంతో ఈజీగా స్కిట్లు చేస్తున్నాడు. మరోవైపు రష్మీతో రొమాన్స్ కూడా ఆడియన్స్ కు చాలా కనెక్ట్ అయింది. ఇప్పటి వరకు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ నే అలరించిన సుధీర్ వెండితెరపై నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే ‘సాఫ్ట్ వేర్ సుధీర్’, ‘త్రీ మంకీస్’ సినిమాల ద్వారా బిగ్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. అయితే స్మాల్ స్క్రీన్ పై ఎంతగా ఫేమస్ అయ్యాడో.. వెండి తెరపై అంతగా విఫలమవుతున్నాడు సుధీర్. అయితే తన నటనతో మాత్రం ఆకట్టుకుంటున్నాడు.
అదృష్టాన్ని నమ్ముకున్న వాడు కష్టాల పాలవుతాడు..
తాజాగా ‘గాలోడు’ సినిమా ద్వారా మళ్లీ తెరపై తన లక్ ను పరీక్షించుకుంటున్నాడు సుధీర్. అయితే తాజాగా గాలోడు టీజర్ విడుదలైంది. పూర్తి మాస్ లుక్కులో సుధీర్ కనిపిస్తున్నాడు. ‘‘అదృష్టాన్ని నమ్ముకున్న వాడు కష్టాల పాలవుతాడు, కష్టాన్ని నమ్ముకున్నవాడు అదృష్ట వంతుడు అవుతాడని… నేను ఈరెండింటిని నమ్ముకోనని.. నన్ను నేను నమ్ముకుంటా’’ అనే డైలాగ్ తో మాస్ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. టీజర్ లో భారీగా యాక్షన్ సీన్సు ఉన్నాయి. దీంతో పక్కాగా పూర్తి యాక్షన్ మూవీగా గాలోడు రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్ గా నటించింది. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.





























