Sudheer : సుడిగాలి సుధీర్… ఈ పేరు తెలియని తెలుగు బుల్లితెర అభిమానులు వుండరు. తెలుగు బుల్లితెర మీద సుధీర్ ఒక స్టార్ నటుడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో, ఇంకా స్పెషల్ ప్రోగ్రాములతో అభమానులను అలరించాడు. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతతో బిజీ గా ఉండటం కారణంగా బుల్లితెర మీద కనిపించడం లేదు. సుధీర్ ఇంట పండగ వాతావరణం నెలకొంది.

సుధీర్ ఇంటికి వారసుడు…..
సుధీర్ ఇంట్లో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. సుధీర్ ఇంటికి వారసుడు వచ్చాడు. అందుకే సుధీర్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. సుధీర్ తమ్ముడు రోహన్ గురించి అందరికీ తెలిసిందే. మనకు తెలిసిందే. రోహన్ కూడా కొన్నిసార్లు సుడిగాలి సుదీర్ టీమ్ లో కనిపించి సందడి చేశారు. రోహన్, సుధీర్ కు తమ్ముడు అయినప్పటికీ సుధీర్ తన కెరీర్ లో బిజీగా ఉండటం కారణంగా మొదట తమ్ముడు వివాహం జరిగింది.

తాజాగా రోహన్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈవిధంగా సుడిగాలి సుధీర్ పెదనాన్నగా ప్రమోట్ అయ్యాడు. ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుసుకున్న అభిమానులు సుధీర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సుధీర్ కు పెదనాన్నగా ప్రమోషన్ వచ్చింది అని కామెంట్లు జత చేస్తున్నారు.

































