Sudigali Sudheer: బుల్లితెర జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ప్రేక్షకులకు పరిచయమైన సుడిగాలి సుదీర్ బుల్లితెరపై అతి తక్కువ సమయంలోనే అంచలంచెలుగా ఎదుగుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా బుల్లితెరపై సుడిగాలి సుదీర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో ఏకంగా ఈయనకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.

ఇలా పలు సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సుధీర్ గాలోడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో సుధీర్ పలు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అయితే వెండితెరపై కూడా మంచి సక్సెస్ సాధించిన సుధీర్ పలు కార్యక్రమాలలో మాట్లాడుతూ నేను ఈ స్థాయికి వచ్చాను అంటే అందుకు కారణం వేణు అన్న అంటూ పలుసార్లు తెలియజేశారు.
వేణు జబర్దస్త్ లో అవకాశం ఇవ్వటం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. ఇక వేణు కూడా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి డైరెక్టర్ గా మారిపోయారు. బలగం సినిమా ద్వారా డైరెక్టర్ గా వేణు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే తాజాగా వేణు గెటప్ శ్రీను సుధీర్ ముగ్గురు కలిసి వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తోంది.’

Sudigali Sudheer: మ్యాడ్ నెస్ ఎప్పటికీ మారదు…
ఈ క్రమంలోనే ఈ ముగ్గురు మంచు కొండల్లో ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి ఫోటోని సుధీర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా మ్యాడ్ నెస్ ఎప్పటికీ మారదు అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారడంతో పలువురు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొందరైతే రశ్మి ఎక్కడ భయ్యా అంటూ ఈ ఫోటోపై కామెంట్లు పెడుతున్నారు.
The madness that never changed @getupsrinu3 @VenuYeldandi9 pic.twitter.com/fEJv4xip3f
— Sudigali Sudheer (@sudheeranand) April 27, 2023





























