చల్లబడిన వాతావరణం కేవలం సైనస్ సమస్య ఉన్నవారికి నరకం తీయగలదు. ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, గొంతు నొప్పి, అలసట… ఇవన్నీ రోజువారీ జీవితాన్ని కష్టతరం చేస్తాయి. ఎన్ని మందులు వాడినా, కొంతకాలం మాత్రమే ఉపశమనం రావడం వలన చాలామంది నిరాశకు గురవుతుంటారు.

అసలు సైనస్ అంటే ఏమిటి? మరియు ఇంటి పరిష్కారాలు ఏవీ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సైనస్ అంటే ఏమిటి?
మన ముక్కు మరియు గొంతుక మధ్య గాలి మరియు శ్లేష్మం ప్రవహించే చిన్న కుహరాలను సైనస్ అంటారు. ఇవి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేసి, ముక్కులోకి వెళ్ళే కాలుష్యకణాలు, అలెర్జీ కారణాలను అడ్డుకుంటాయి.
సైనసైటిస్ అంటే ఈ కుహరాల మధ్య ఉండే కణజాలం వాచిపోవడం. దీంతో గాలి, శ్లేష్మం సరిగ్గా ప్రవహించలేకపోవడం, తీవ్ర తలనొప్పి, ఒత్తిడి, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సైనస్ లక్షణాలు
- ముక్కు దిబ్బడ, తీవ్రమైన తలనొప్పి
- ముఖంలో వాపు, ముక్కులో నొప్పి
- గొంతు నొప్పి, పొడి దగ్గు
- వాసనను గుర్తించలేకపోవడం
- జ్వరం, అలసట
ఈ లక్షణాలను గమనిస్తే, సమస్యను ఎప్పటికి విస్మరించకూడదు.
సైనస్ నివారణకు ‘మ్యాజిక్ మిల్క్’
సైనస్ సమస్య కోసం ఖరీదైన మందులు కాకుండా, ఇంట్లో ఉండే పదార్థాలతో తయారుచేసిన పాల తాగడం మంచి ఉపశమనం ఇస్తుంది.
కావాల్సిన పదార్థాలు:
- పాలు – 1 గ్లాసు
- బాదం పప్పులు – 3
- మిరియాలు – 3
- పటికబెల్లం (మిశ్రీ) – చిన్న ముక్క
తయారీ విధానం
- గిన్నెలో పాలను పెట్టి సన్నని మంటపై వేడి చేయండి.
- పాలు కొద్దిగా వేడెక్కాక, బాదం పప్పులను సన్నగా తురిమి చేర్చండి.
- మిరియాలను కొద్దిగా క్రష్ చేసి పాలలో కలపండి.
- తీపికోసం ఒక చిన్న ముక్క పటికబెల్లం వేసి 3 నిమిషాల పాటు మరిగించండి.
వాడక సూచనలు
- పాలను గోరువెచ్చగా తాగాలి.
- ఈ ప్రక్రియను నిత్యక్రమంలో ఒక నెల పాటు కొనసాగించండి.
- మిరియాలు, బాదం కలిగిన గుణాలు ముక్కు రంధ్రాలను క్లియర్ చేసి, సైనస్, తలనొప్పి, ముక్కు దిబ్బడ, అలసట తగ్గిస్తాయి.
- ఈ చిట్కా ప్రారంభ దశలో ఉన్న సైనస్, సాధారణ జలుబుకు అద్భుతంగా పనిచేస్తుంది.
- తీవ్రమైన, దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సంప్రదించాలి.


























