Suhani Kalita : ‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘తూనీగా తూనీగ’ పాట గుర్తుందా… అప్పట్లో ఆ సాంగ్ చాలా ఫేమస్, స్కూల్ ఫంక్షన్స్ లో బాగా డాన్స్ చేసేవాళ్ళు ఆ పాటకు. ఆ పాటలో నటించిన చిన్నప్పటి రీమా సేన్ పాప గుర్తుందా తానే సుహాని కలిత. ‘బాల రామాయణం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయయం అయిన సుహాని ప్రేమంటే ఇదేరా, గణేష్, మనసంతా నువ్వే, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇక మళ్ళీ పెద్దయ్యాక హీరోయిన్ గా కూడా సుహాని అదృష్టాన్ని పరీక్షించుకుంది.

గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న సుహాని…
2008లో వచ్చిన ‘సవాల్’ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా పెద్దగా కలిసిరాలేదు. ఇక చివరగా ‘స్నేహగీతం’ సినిమాతో హీరోయిన్ గా నటించిన సుహాని ఆ సినిమాకు మంచి పేరు వచ్చినా అమ్మడికి ఆవకాశాలు మాత్రం రాలేదు. ఇక పలు వాణిజ్య ప్రకటనలలో కనిపించిన సుహాని ఇతర భాషలలో కూడా నటించినా పెద్దగా కలిసిరాలేదు. దీంతో సినిమాల్లో కనిపించలేదు చాలా రోజుల నుండి. ఇక ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది.

సుహాని కలిత, విభర్ హసీజ ను వివాహం చేసుకుంది. ఇతను ప్రముఖ సంగీత కారుడు, పైగా మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇక వీరి ఎంగేజ్మెంట్ పెద్దలు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఇటీవల గ్రాండ్ గా జరిగింది. ఇక పెళ్లి కూడా బంధువుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లి ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి.































