Suhani Kalita : ‘మనసంతా నువ్వే’ సినిమాలో ‘తూనీగ తూనీగ’ పాట గుర్తుందా?? అప్పట్లో ఆ సాంగ్ చాలా ఫేమస్ స్కూల్ ఫంక్షన్స్ లో బాగా డాన్స్ చేసేవాళ్ళు ఆ పాటకు. ఆ పాటలో నటించిన చిన్నప్పటి రీమా సేన్ పాప గుర్తుందా, తానే సుహాని కలిత. ఆ తరువాత తరుణ్ ‘ఎలా చెప్పను’ వంటి సినిమాల్లో కూడా నటించిన సుహాని కలిత బాల నటిగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. ఇక మళ్ళీ పెద్దయ్యాక హీరోయిన్ గ కూడా సుహాని అదృష్టాన్ని పరీక్షించుకుంది.

పెళ్లి చేసుకోబోతున్న సుహాని…
‘స్నేహగీతం’ సినిమాతో హీరోయిన్ గా సినిమాల్లో నటించిన సుహాని ఆ సినిమాకు మంచి పేరు వచ్చినా అమ్మడికి ఆవకాశాలు మాత్రం రాలేదు. దీంతో సినిమాల్లో కనిపించలేదు చాలా రోజుల నుండి. ఇక ఇప్పుడు ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతోంది. ఎంగేజ్మెంట్ కి సంబంధిచిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సుహాని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అయితే వరుడు ఎవరంటే.. విభర్ హసీజ. ఇతను ప్రముఖ సంగీత కారుడు, పైగా మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇక వీరి ఎంగేజ్మెంట్ పెద్దలు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఫంక్షన్స్ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి.



























