Suhasini Manirathnam : సినిమా ప్రచారం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. మా సినిమా అలా ఉంది ఇలా ఉంది చూడండి అనడం వేరు. ఇక పర భాష చిత్రాన్ని ప్రమోట్ చేసేటపుడు లోకల్ హీరోలను పొగుడుతూ వారిని ఈవెంట్ కి పిలవడం ఒక స్టైల్ అయితే సినిమాలో ఆ ప్రాంత నటులు కూడా ఉన్నారు ఇది ఇక్కడి సినిమా కూడా అంటూ ప్రొజెక్ట్ చెయడం మరో ఎత్తు. అయితే ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా యూనిట్ ఏమనుకుందో గాని ఇవి రెండూ కాకుండా కొత్త పంథా ఎంచుకుంది. తెలుగు వాళ్ళు మరీ అంత తెలివితక్కువ వాళ్ళ అనేలా చేశారు.

మసి పూసి తెలుగు సినిమా అంటూ చెప్పే ప్రయత్నం…
మణిరత్నం సినిమా అనగానే నేటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. ఇక తమిళ సినిమాలలో అక్కడి కల్చర్, వాటి వాసనా మామూలే ఆదితప్పు కూడా కాదు. అలాగని పాన్ ఇండియా సినిమా పేరుతో తమిళ సంస్కృతినే చూపించబోతున్నాడు మణిరత్నం. ఇక ఆ సినిమా పక్కనున్న మనకు ముందు ఎక్కాలి అందుకే ఇక్కడ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ చేశారు. ఇక ఈ ఈవెంట్ లో మణిరత్నం భార్య మాజీ హీరోయిన్ సుహాసిని కి ఈవెంట్ హోస్టింగ్ బాధ్యత ఇచ్చేసారు. దీనికి రెండు కారణాలు ఒకటి సుహాసిని కి తెలుగు తెరకు ఉన్న అనుబంధం, ఇంకోటి ఇది మణిరత్నం సొంత సినిమా ఒకరకంగా ఇది మణిరత్నం కు అగ్నిపరీక్ష అవడం వల్ల భార్యగా సినిమా ప్రచార బాధ్యత నెత్తిన వేసుకుంది సుహాసిని.

అంతా బాగుంది కానీ సినిమాను తెలుగు సినిమా అంటూ ప్రొజెక్ట్ చేయడమే కొంచెం ఓవర్ అయింది. సినిమాలో ఒక్క తెలుగు నటుడు లేకపోయినా ఇతర భాషా నటులు లేక పోయినా అది పాన్ ఇండియా సినిమా, ఇక తెలుగు వాళ్ళు లేకపోయినా సినిమా షూటింగ్ ఇక్కడ కొంత పార్ట్ చేసారు కాబట్టి తెలుగు సినిమా అంటూ చెప్పడం హాస్యాస్పదం. ఇక ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో సమర్పిస్తున్నాడు కాబట్టి తెలుగు సినిమా అనడం మరో విడ్డూరం. ఇక పాటల రచయిత అనంత్ శ్రీరామ్ కూడా ఈ సినిమా లోని పాటలు చక్కగా రావడానికి కారణం తెలుగు భాష ఔన్నత్యం అని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటివరకూ ఒక్క పాట కూడా ప్రేక్షకులను అలరించలేదు.

































