Suhasini Maniratnam : తెలుగువాళ్లకు అలనాటి హీరోయిన్ సుహాసిన సుపరిచితురాలు. ‘స్వాతి’ సినిమా నుండి హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో అగ్ర హీరోలదరితో నటించిన ఈ హీరోయిన్ నటన, కట్టుబొట్టుతో ప్రేక్షకులను అలరించింది. సుహాసిని నవ్వుకు పడిపోని అప్పటి కుర్రకారు ఉండరేమో. తమిళనాడుకు చెందిన సుహాసిని, తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఇక ప్రేమించి డైరెక్టర్ మణిరత్నం ను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చిన సుహాసిని తన భర్త గురించి కొత్త విషయాలను చెప్పింది.

సినిమాను కష్టపడి ఏమి చేయలేదు…
సుహాసిని మణిరత్నం దర్శకత్వంలో సినిమాలు చేస్తున్న సమయంలో ప్రేమలో పడి, ఆ వార్త అందరికీ తెలియడంతో సుహాసిని తండ్రి ఇంకెవరూ నిన్ను పెళ్లి చేసుకోరు అని మణిరత్నం కే ఇచ్చి పెళ్లి చేశారట. అలా నచ్చినవాడినే పెళ్లి చేసుకున్నారు సుహాసిని. ఇక మణిరత్నం అనగానే రొమాంటిక్ ప్రేమకథలు గీతాంజలి, సఖి, రోజా వంటివి గుర్తొస్తాయి. అయితే ఈసారి మాత్రం హిస్టరికల్ సినిమాను చేస్తున్నారు. అందునా భారీ క్యాస్ట్ తో సినిమా తీస్తున్నారు. విక్రమ్, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ వంటివారు నటిస్తున్న ఈ సినిమా కోసం మణిరత్నం చాలా కష్ట పడ్డారు.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుండంతో ప్రమోషన్స్ కోసం కూడా అంతే ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో సినిమా కోసం గ్రాండ్ ఈవెంట్ ను చేసారు చిత్ర యూనిట్. ఈవెంట్ లో తెలుగు రాష్ట్రాలను తన పుట్టిన ఇల్లుగా వర్ణించింది సుహాసిని. నాకు చాలా సందేశాలు వస్తున్నాయి, మణిరత్నం చాలా కస్టపడుతున్నాడు జాగ్రత్తగా చూసుకో అంటూ చెబుతున్నారు. అయితే మా అయన ఈ సినిమా కోసం కష్టపడలేదు ఇష్టం తో పనిచేసారు ఈ సినిమా తో అయన మరింత గొప్ప పేరును తెచ్చుకుంటారు. అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా వారి కెరీర్ లో మరో మెట్టు ఎక్కడానికి ఉపకరిస్తుంది అంటూ చెప్పింది.































