అతడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. పెళ్లి కావడం లేదని ఎంత పని చేశాడో తెలుసా..?

పెళ్లి అనేది చెప్పడానికి రెండక్షరాల పదమే అయినా ఆ రెండక్షరాలను కలపాలంటే రెండు కుటుంబాలు దగ్గరవ్వాలి. ప్రతీ ఒక్కరి ఆశీస్సులు తీసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మనకు సినిమా డైలాగ్ లే వస్తాయి. అయితే విషయానికి వస్తే.. ఎప్పుడు జరగాల్సిన కార్యం అప్పడే జరగాలి.. అని పెద్దలు అంటుంటారు.

పెళ్లి జరగాలంటే పరుషుడుకి 21 ఏళ్లు.. మహిళకు 18 ఏళ్లు ఉంటే.. చట్ట ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. కానీ కొంతమందికి 21 ఏళ్లు దాటిని తర్వాత జాబ్ అంటూ.. ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవాలంటూ సమయాన్ని వృథా చేసుకుంటూ వెళ్తుంటారు. దీంతో వయస్సు అయిపోయి 30 ఏళ్ల వరకు వస్తుంది. అప్పటి నుంచి పెళ్లి జరగడం లేదని బెంగ, భయం ఉంటుంది. ఒక వేళ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టినా ఏదో ఒక కారణంతో సంబంధం కుదరకపోవడం వంటివి కూడా జరుగుతుంటాయి.

దాంతో విచిత్రమైన ఆలోచనలు, డిప్రెషన్ లోకి వెళ్లిపోవడం వంటివి సాధారణంగా జరుగుతాయి. ఇలాంటి ఘటనే ఒకటి కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు పూర్తి వివరాలను ఇలా తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన 28 ఏళ్ల ఆకుల రాజ్ కుమార్ బాగా చదువుకున్నాడు. దీంతో ముంబైలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి జీతం.

అయితే కరోనా కారణంగా పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం చేయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలానే రాజ్ కుమార్ కూడా ఇంట్లో వర్క్ ఫ్రం హోం చేసుకుంటూ ఉన్నాడు. గత కొన్ని రోజుల నుంచి తనకు ఇంకా పెళ్లి కావడం లేదనే ఆలోచనలో పడ్డాడు. 28 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి కావడం లేదనే బెంగతో అర్థరాత్రి అతడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.