Pushpa-Alluarjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్ లో వచ్చిన ప్యాన్ ఇండియా మూవీ పుష్ప భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా.. కలెక్షన్ల విషయంలో ’ తగ్గేదేలే‘ అంటోంది. సినిమా రీలీజ్ కు ముందే బన్నీ మేనరిజం, దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్, సమంత ఐటెం సాంగ్ జనాల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి.
దీంతో పాటు మరో వైపు మళయాళ స్టార్, టాలెంటెడ్ హీరో ఫహాద్ ఫాజిల్ విలనిజం సినిమాపై భారీ అంచానాలు పెంచేలా చేసింది. మరోవైపు పుష్ప 2 కోసం సుకుమార్, చిత్ర యూనిట్ ప్రమోషన్లు కూడా ప్రారంభించిన వాతావరణం కనిపిస్తోంది. పుష్ప 1 ను మించి పుష్ప 2 ఉంటుందని డైరెక్టర్ సుకుమార్ చెప్పకనే చెబుతున్నారు. అయితే పుష్ప మొదటి భాగంలో అనుకున్నంతగా యాక్షన్ సీన్లు లేవని, సుకుమార్ స్క్రీన్ ప్లేలో గ్రిప్ లేదని అభిమానులు అంటున్నారు.
అయితే పుష్ప 2 మాత్రం అంతకు మించి యాక్షన్ ఎపిసోడ్లు ఉంటాయని డైరెక్టర్ సుకుమార్ చెబుతున్నారు. పుష్ప సినిమాలో క్లైమాక్స్ పెద్దగా పేలలేదని బన్నీ ఫ్యాన్స్ తో పాటు, సాధారణ ఆడియన్స్ అనుకుంటున్నారు. అయితే సినిమాకు ముందు సుకుమార్ అనుకున్న క్లైమాక్స్ వేరని తెలుస్తోంది. ముందుగా బన్నీ, ఫహాద్ ఫాజిల్ న్యూడ్ సీన్లతో క్లైమాక్స్ చిత్రీకరించాలని అనుకున్నాడు సుకుమార్.
అయితే ఇలాంటి సీన్లు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా ఎక్కవని… అండర్ వేర్ తో క్లైమాక్స్ సీన్లను షూట్ చేశానని వెల్లడించాడు సుక్కు. అయితే ఈ క్లైమాక్స్ పై జనాలు పెదవి విరుస్తున్నారు. బన్నీ వీర మాస్ లో నటించిన పుష్పలో ఈ నాసిరకం క్లైమాక్స్ ఏంటని అంటున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…