Samantha-Nagachaitanya: నాగ చైతన్య- సమంత టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా ఉండే వారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే ఏమైందో ఏమో కానీ ఇటీవల వీరిద్దరు విడాకులతో విడిపోయారు. అయితే అసలు విడాకులకు కారణాలేమిటో ఇప్పటికీ తెలియలేదు.
అయితే ఫ్యాన్స్ మాత్రం తమకు నచ్చినట్లుగా ఊహాగానాలను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. ముఖ్యంగా సమంతపై చై ఫ్యాన్స్ రెచ్చిపోయారు. విడాకులకు సమంతే కారణం అన్న రీతిలో ట్రోలింగ్ చేశారు. ఈవ్యవహరం పై గతంలో సమంత కూడా చాలా బాధపడింది.
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువునష్టం దావా కూడా వేసింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య, సమంత సినిమాల్లో బిజీ అయిపోయారు. చైతన్య బంగార్రాజు షూటింగ్ లో బిజీగా ఉండగా… సమంత శాకుంతలం అనే ప్యాన్ ఇండియా మూవీ చేస్తోంది. అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత కలిసింది లేదు. పెద్దగా ఒకరినొకరు ప్రస్తావించుకుంది లేదు.
అయితే ఇటీవల ఓ చోట కలిసే పరిస్థితి ఏర్పడింది. బంగార్రాజు ఆఖరి షెడ్యూల్ షూటింగ్ రామానాయుడు స్టూడియోలో నడుస్తోంది. మరోవైపు అదే స్టూడియోలో సమంత శాకుంతలం సినిమా ప్రారంభమైంది. అయితే సెట్ లో వీరిద్దరు పరస్పరం ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ఒకరికొకరు ఎదురుపడకుండా ముందుగానే నాగ చైతన్య- సమంతలు వారివారి అసిస్టెంట్లకు ముందుగానే సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఉండకుండా జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…