Suman: సినీ నటుడు సుమన్ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల గురించి ఈయన స్పందిస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుమన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

సినీ నటుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో ఎంతో మంది ఈయనని రాజకీయంగా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని మహిళల పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం బాధ్యత లేదు అంటూ ఎన్నోసార్లు వైకాపా నాయకులు విమర్శలు చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి అంటే ముందుగా ఆయన పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువచ్చేవారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు రావడంతో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు కాకుంటే 30 పెళ్లిళ్లు చేసుకుంటారు. అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయమని తెలిపారు.
పవన్ కళ్యాణ్ కే మద్దతు..
ఇలా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు కాకుంటే 30 చేసుకున్న ఆయనకు లేని బాధ మీకేంటి అని ప్రశ్నించారు. ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నేనెప్పుడూ ఇండస్ట్రీకి మద్దతు తెలియజేస్తాను ఇప్పుడు కూడా నా పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ కి ఉందని సుమన్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































