భారీ అంచానాల మధ్య రిలీజ్ అయిన పుష్ప మూవీ నిన్ననే విడుదలైంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ కావడంతో… అలవైకుంఠపురం వంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది. అయితే సినిమా ప్రారంభమైనప్పట నుంచి సునీల్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది.

మంగళం సీను వంటి విలన్ పాత్రలో సునిల్ మొదటిసారిగా చేస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. డిఫరెంట్ గెటప్ తో క్రూరంగా కనిపిస్తుండటంతో ఈ పాత్ర ఎలా ఉంటుందో అని ముందు నుంచే ఇంట్రెస్ట్ నెలకొంది. మంగళం శ్రీను పాత్రలో ఎర్రచందనం స్మగ్లర్ల సిండికేట్ నాయకుడిగా సునీల్ నటించారు. సునీల్ కు భార్యగా ద్రాక్షాయణి పాత్రలో హాట్ యాంకర్ అనసూయ నటించింది. వీరిద్దరి గెటప్ లు సినిమాపై బజ్ ను మరింత పెంచాయి.

అయితే మంగళం శ్రీను పాత్ర సినిమాలో పెద్దగా పేలలేదని అభిమానులు అనుకుంటున్నారు. విలన్ గా సునీల్ ఒకే కానీ.. భయపెట్టలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంటర్వెల్ ముందు వచ్చే సమంత ఐటెం సాంగ్.. మంగళం శ్రీను అడ్డాలోనే జరుగుతుంది. దీని తర్వాత మంగళం శ్రీనుకు పుష్ప వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుంది. సినిమాలో సునీల్ మంగళం శ్రీను పాత్ర చాలా ప్రాధాన్యం ఉన్నదే. పుష్ప మంగళంశ్రీనును ఎలా ఎదుర్కొన్నాడనేది తెరపైనే చూడాలి. ఇక మరోవైపు ద్రాక్షాయణిగా అనసూయ క్యారెక్టర్ కూడా అనుకున్నంత గొప్పగా లేదని తెలుస్తోంది. అయితే ఈ క్యారెక్టర్ కు మాత్రం ఓ ట్విస్ట్ ఉంటుంది.

సినిమా రిలీజ్ కు ముందు మంగళం శ్రీను క్యారెక్టర్ పై సునీల్ చాలా గొప్పగా చెప్పారు. విలన్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చానని.. ఇప్పటికి తన కోరిక తీరిందన్నాడు. మంగళం శ్రీను క్యారెక్టర్ కోసం పదేళ్లు పెద్ద వ్యక్తిగా కనిపించానని చెప్పుకొచ్చారు. సుకుమార్ కరోనా టైంలోనే ఈ క్యారెక్టర్ గురించి చెప్పారని తెలిపారు. ఈ పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకుని నటించానని అన్నారు. ఇతర భాషల్లో కూడా మంచి అవకాశం వస్తే నటిస్తానని అన్నాడు.





























