Sunil Kanugolu : కాంగ్రెస్ రహిత భారత్ అంటూ ప్రధాని మోడీ వ్యూహాలకు పదును పెడుతుంటే దక్షిణ భారత దేశంలో కర్ణాటకలో కాంగ్రెస్ అద్భుత విజయాన్ని నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ విజయం వెనుక ప్రముఖంగా వినిపించిన పేరు పోల్ స్ట్రాటెజిస్ట్ సునీల్ కనుగోలు. ఇక తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయములో కూడా ఆయన పాత్ర ఉందనే విషయంలో సందేహం లేదు. అయితే అసలు ఎవరీ సునీల్ కనుగోలు, ఆయన నేపధ్యం ఏమిటి అనే విషయాలు ఇపుడు చర్చకు వస్తున్నాయి.

ప్రశాంత్ కిషోర్ కి పోటీ ఈ సునీల్…
ఎన్నికల వ్యూహకర్త అనగానే గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. ఆయన గత ఎన్నికల్లో ఏపీ లో వైసీపీ గెలుపుకు అంతకు ముందు బిజేపి విజయాలకు కారణం. ఇక ఆయన శిష్యుడే ఈ సునీల్ కనుగోలు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన సునీల్ తెలుగు కుటుంబానికి చెందినవాడు. చదువుయ్యాక అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగం చేసుకుంటుండగా ప్రశాంత్ కిషోర్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. ఇక ఆపైన పలు రాష్ట్రలలో పలు రాజకీయ పార్టీల విజయాలలో కీలక పాత్ర పోషించాడు సునీల్. ఇక ఏబీఎం అసోసియేషన్ అఫ్ బ్రిలియంట్ మైండ్స్ పేరుతో సొంత సంస్థ స్థాపించి ప్రశాంత్ కిషోర్ సంస్థ నుండి బయటికి వచ్చిన సునీల్ తమిళనాడు ఎన్నికలలో డీఎంకే విజయంలోనూ కీలక పాత్ర పోషించారు.

అలాగే 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రచార వ్యవహారాలను చూసుకుని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరఖాండ్, హిమాచల్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ కోసం పనిచేసారు. ఇక కాంగ్రెస్ టాస్క్ఫోర్స్ నవకల్ప్ లో సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పాటు పనిచేసారు సునీల్. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్రకు వ్యూహకర్తగా సునీల్ వ్యవహారించారు. ఇక 2024 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఢీ కొనడానికి ఇప్పటి నుండే సమాయత్తమవుతున్నారు సునీల్ కనుగోలు.





























