Sunitha Boya : తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతలలో బన్నీవాసు కూడా ఒకరు. గీతా ఆర్ట్స్ సంస్థ లో పార్ట్నర్ గా బన్నివాసు వ్యవహరిస్తున్నారు. 100% లవ్ సినిమాతో నిర్మాతగా కెరీర్ ని ప్రారంభించారు బన్నీవాసు. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కు అత్యంత సన్నిహితుడు బన్నివాసు. అయితే ఇటీవల బన్నీవాసు మీద ఒక నటి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తనను మోసం చేశాడంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ఎదురుగా నటి ఇదివరకే ఒకసారి ఆందోళన చేసింది.

గీత ఆర్ట్స్ ఎదురుగా మరోసారి ఆందోళన…..
గతంలో శ్రీరెడ్డి ఇలానే ఆందోళన చేసి పబ్లిసిటీ పొందిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ కోవలోనే సినీ నటి అయిన సునీత బోయ నిర్మాత బన్నీవాసు తనని మోసం చేశాడు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదివరకు ఒకసారి గీతాఆర్ట్స్ ఎదురుగా అర్ధ నగ్నంగా ఆందోళన చేసింది. మరి ఇప్పుడు మరొక సారి గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద గేటుకు వేలాడుతూ వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఆందోళన ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.

బన్నీవాసు గతంలో జనసేన పార్టీ తరపున పని చేసే సమయంలో తనని మోసం చేసాడని బోయ సునీత ఆరోపిస్తోంది. అయితే పని గట్టుకుని అదేపనిగా బన్నీవాసు పై సినీ నటి బోయ సునీత ఆరోపణలు చేయడంపై పోలీసులకు కూడా ఎలా స్పందించాలో అర్థంకానీ సంధిగ్ధంలో వున్నారు. మరో వైపు ఆమె మానసిక స్థితిగా సరిగ్గా లేదనే వాదనలు కూడా తెరపైకొస్తున్నాయి. ఈ వివాదంలో ఒక రాజకీయ పార్టీని కూడా లాగుతుండటం తో అందరిలోనూ ఆసక్తినెలకొంది. ఈ వివాదం ఇలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.


































