Super Star Krishna : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలోయింగ్ అవకుండా సెట్ చేసిన వాళ్లలో క్రొష్ణ ముందుంటారు. కొత్తదానాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబం కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక కృష్ణ గారి వారాసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. కృష్ణ గారికి అప్పట్లో ఉన్న ఫాలోయింగ్ రెట్టింపు ఫాలోయింగ్ తో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు మహేష్ బాబు.

దాసరి తో ఒక హిట్టు లేదు…
కృష్ణ గారు ఎంతో మంది డైరెక్టర్లతో కలిసి పనిచేసారు. కొత్త పాత అని లేకుండా అందరితో కలిసి పనిచేసారు. ఆల్మోస్ట్ అందరి దర్శకులకూ హిట్లిచ్చారు. ఒకవేళ ఎవరి సినిమా అయినా ఫ్లాప్ అయితే మళ్ళీ అదే డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చి ప్రోడ్యూసర్ కుదరక పోతే ఆయనే పూచికత్తు మీద ప్రొడ్యూసర్ ని ఒప్పించి సినిమా తీసేవారట. అయితే అప్పట్లో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న దాసరి గారి తో మాత్రం కృష్ణ గారికి హిట్ సినిమా లేకపోవడం గమనార్హం. దాసరి నారాయణ రావు గారు కృష్ణ గారి కాంబినేషన్ లో వచ్చిన ‘శుభమస్తు’ సినిమా ఘోరంగా విఫలమైంది.

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో హిట్ సినిమా లేకపోవడం ఒక లోటుగా కృష్ణ గారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ లోటు కొంతలోకొంత భర్తీ చేసారు దాసరి గారు. కృష్ణ గారిని హీరోగా పెట్టి సినిమా తీయకపోయినా ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాలో అతిధి పాత్రలో అయనతో నటింపజేశారు. ఇక ఆ సినిమా చాలా పెద్ద హిట్, అలా నేరుగా వారిద్దరి కాంబినేషన్ లో హిట్ సినిమా లేకపోయినా దాసరి హిట్ సినిమాలో కృష్ణ గారు నటించారు. అలా కొంతైనా అసంతృప్తి తగ్గించుకున్నారు ఇద్దరూ.
































