Super Star Krishna : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలోయింగ్ అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదనాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబ కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మల్టీ స్టారర్ సినిమాలను కూడా ఎక్కువగా అందరి హీరోలతో, దాదాపు అందరు హీరోలతో చేశారు. అలా శోభన్ బాబుగారి తో ముందడుగు, మండే గుండెలు అంటూ హిట్స్ ఇచ్చారు వీరిద్దరి ధ్వయం. అయితే ఒక సినిమా విషయంలో మాత్రం ఇద్దరూ కలిసి సినిమాలో నటించాలనుకొని చివరికి శోభన్ బాబు గారు నిరాకరించడంతో కృష్ణ గారు మాత్రమే సోలోగా సినిమా చేసారు.

జయం మనదే శోభన్ బాబు వద్దానడానికి కారణం…
కృష్ణ కు ఫ్యామిలీ డాక్టర్ అయిన డివిఎన్ రాజు గారు ఆయనతో సినిమా చేయాలని అనుకున్నపుడు కథ రెడీ చేసుకునే పనిలో పడ్డాడు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ వేంకట సుబ్బయ్య కి శోభన్ బాబు, కృష్ణ ఓదారితో సినిమా చేయాలని ఎప్పటి నుండో కోరిక. ఇక ఇదే విషయాన్ని డాక్టర్ రాజు గారితో చెప్పడంతో శోభన్ బాబు, కృష్ణ ఇద్దరినీ పెట్టి ధనికులు, కార్మికులను ఎలా దోచుకుంటున్నారు అనే కథాంశంతో ఎదురు తిరిగిన ఇద్దరు యువకుల కథగా సినిమా అనుకున్నారు. ఇక పరుచూరి బ్రదర్స్ కి స్క్రీన్ ప్లే బాధ్యత అప్పగించారు. ఆల్రెడీ కృష్ణ శోభన్ బాబు మల్టీ స్టారర్ కి పనిచేసిన అనుభవం ఉన్న పరుచూరి బ్రదర్స్ ఇక స్క్రిప్ట్ పనిలో ఉన్నారు. శోభన్ బాబు, ఇటు కృష్ణ ఇద్దరు కథ ఒకే చేయడంతో చెరో లక్ష ఇద్దరికి అడ్వాన్స్ ఇచ్చారు. ఇక హీరోయిన్లు గా శ్రీదేవి కృష్ణ సరసన, జయప్రద శోభన్ బాబు సరసన అనుకోని వారికి చెరో 50 వేలు అడ్వాన్స్ ఇచ్చి షూటింగ్ మొదలు పెట్టాలి అనుకున్న తరుణం లో కృష్ణ, శోభన్ బాబు నటించిన ‘మహా సంగ్రామం’ సినిమా విడుదల అయి ఆ సినిమాలో శోభన్ బాబు గారి పాత్ర నిడివి తక్కువ ఉందని ఆయన అభిమానులు గొడవ చేసే సరికి ఆయన మళ్ళీ వెంటనే మల్టీ స్టారర్ తీయకూడదనే నిర్ణయం తీసుకున్నారు.

ఇక షూటింగ్ మొదలు పెట్టాలి అనే తరుణం లో మేకప్ మాన్ ద్వారా క్యాన్సిల్ చేసుకున్నట్లు డాక్టర్ కి డైరెక్టర్ బాపయ్య కి కబురు పంపారు. ఇక డాక్టర్ గారు ఇంటికి వెళ్లి అడిగినా ఆయన ససేమిరా అనడంతో చేసేదేమీ లేక కృష్ణ దగ్గరికి వెళ్లారు రాజు. ఇక కృష్ణ గారు ఇప్పటికిప్పుడు మరో హీరో దొరకదు కాబట్టి సోలో హీరో గా సినిమాను మార్చు నేను చేస్తా అని చెప్పారు. ఇక ఇద్దరు హీరోలు లేరు కాబట్టి జయప్రద ను తొలగించాలి అని నిర్ణయించి ఆమె వద్దకు వెళ్లి చెప్పగా ఆమె పర్వాలేదు అని చెప్పి అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసిందట. ఇక అలా జయం మనదే సినిమా పూర్తయి మంచి విజయాన్ని నమోదు చేసింది.

































