Super Star Rajinikaanth : రజినీకాంత్ 1975 లో కె. బాలచందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగల్’ అనే సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినీ ప్రపంచానికి పరిచయం అయ్యాడు. తరువాత చిన్న చిన్న పాత్రలలోనూ, నెగిటివ్ పాత్రలలో కూడా నటించి మెప్పించాడు. 1995 లో వచ్చిన ‘భాషా’ సినిమా తన సినిమా కెరీర్ లోనే పెద్ద కమర్షియల్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ సినిమాతో తమిళనాట ప్రజలకు ఒక దేవుడు లాగ మారిపోయాడు. తెలుగులో ‘అంతులేని కథ’ సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకున్నాడు. తమిళనాట అభిమానులకి రజినీకాంత్ ‘తలైవా’. అయితే రజినీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి చాలా చర్చలే జరిగాయి.

దక్షిణాదిన ఒక కీలక రాష్ట్రానికి గవర్నర్ గా…
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని, రజినీకాంత్ చివరి క్షణంలో ఆరోగ్య కారణాలతో విరమించుకున్న సంగతి తెలిసిందే. అయితే తలైవా కు బీజేపీ ప్రభుత్వం గొప్ప ఆఫర్ ఇస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దక్షిణాదిన ఒక కీలక రాష్ట్రానికి రజినీకాంత్ ని గవర్నర్ గా ఆఫర్ ఇచ్చినట్లు, దానికి రజినీకాంత్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీని గురించి తమిళనాట విస్త్రుతమైన ప్రచారం జరుగుతోంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఎపుడు పూర్తిస్తాయిలో మెజారిటీ సాధించడం కష్టం అవ్వొచ్చు అని, అక్కడ కాస్త బీజేపీ వెనకడుగు వేసినా దక్షిణాదిన ఆ సీట్లను భర్తీ చేసుకునే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో రజినీకాంత్ విషయంలో ప్రయత్నాలు జరిపినా అపుడు ఫలించలేదు, ఏకంగా రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పేసారు. ఈసారి గవర్నర్ పదవి ఆఫర్ చేసి అయన అభిమానులను తమ వైపు తిప్పికునే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అయితే కొద్దిరోజుల క్రితం రజినీకాంత్ తమిళనాడు గవర్నర్ ని కలవడం జరిగింది. అపుడు కూడా ఇలానే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నట్టు ప్రచారం జరగడం, రజిని అలాంటిది ఏమీ లేదు అని క్లారిటీ ఇవ్వడం తెలిసిందే. ఇపుడు అలానే జరుగుతుందా లేదా నిజంగా గవర్నర్ పదవి చేబడుతారా అన్న ఆసక్తి నెలకొంది.































