Surekha Vani: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి గురించి పరిచయం అవసరం లేదు ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో వివిధ పాత్రలలో నటించి పెద్ద ఎత్తున తెలుగు ప్రేక్షకులను సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.

సురేఖ వాణి ప్రస్తుతం సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కూతురు సుప్రీతతో కలిసి చేసే డాన్స్ రీల్స్, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేవిధంగా తన కూతురుతో కలిసి తరచూ హాలిడే వెకేషన్ కి వెళ్లడం, ఆ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఇకపోతే తన తల్లి సురేఖ వాణి పుట్టినరోజు వేడుకలను సుప్రీత విదేశాలలో సెలబ్రేట్ చేసిన విషయం మనకు తెలిసిందే సురేఖవాణి పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా సురేఖ వాణి తన కూతురు సుప్రీత పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే సుప్రీత పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా నెటిజన్ల ఆగ్రహానికి కూడా గురవుతున్నాయి.

Surekha Vani: బర్త్ డే పార్టీలో చిల్ అయిన తల్లి కూతుర్లు…
సుప్రీత పుట్టినరోజు వేడుకలలో భాగంగా సురేఖ వాణి దగ్గరుండి తన కూతురుకు మద్యం తాపిస్తూ బర్తడే పార్టీని సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతో మంది నేటిజెన్లు అసలు నువ్వు తల్లివేనా..ఒక తల్లి అయ్యుండుకొని కూతురికి దగ్గరుండి ఇలా మద్యం తాపించడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున తనపై మండిపడుతున్నారు.ఇలా నేటిజన్ లు వారి గురించి ఎన్ని నెగిటివ్ కామెంట్లు చేసిన వాటిని ఏమాత్రం పట్టనట్టుగా వీరు మాత్రం పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.
Surekha vani daughter supritha birthday celebrations..#supritha #Surekhavaani pic.twitter.com/UZ5aW6Fjch
— TeluguDesk ???????? (@telugudesk) August 10, 2022






























