Suresh Babu : మూవీ మొఘల్ రామానాయుడు గారు తెలుగు సినిమా పరిశ్రమకు ఎనలేని కృషి చేశారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఎన్నో సినిమాలను నిర్మించారు అలాగే రామానాయుడు స్టూడియోస్ ద్వారా సినిమా పరిశ్రమకు సేవ చేసారు. ఇక ఆయన కుమారులు దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్ లు కూడా సినిమా రంగంలోనే ఉన్నారు. సురేష్ బాబు సినిమా నిర్మాణ బాధ్యతలను తీసుకుంటే వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి అగ్రహీరోలలో ఒకరిగా ఉన్నారు. ఇక వాళ్ళ ఇంటి నుండి మూడోతరం నటుడుగా రానా కూడా హీరోగా వచ్చాడు. ఇక విభిన్న కథలను ఎంచుకుంటూ అలరిస్తున్నాడు. ఇటు వ్యాపారం అటు సినిమాలు అంటూ ఉండే సురేష్ బాబు గారు వారి వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర వాఖ్యలు చేసారు.

క్యాస్టింగ్ కౌచ్ గురించి స్పందించిన సురేష్ బాబు…
రామానాయుడు గారి జీవిత విశేషాలతో బయో పిక్ తీయాలనే ఆలోచన లేదని సురేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఆయన బయో పిక్ తీయాలంటే మా కుటుంబ వ్యక్తిగత విషయాలను చెప్పాలి, అది మాకు ఇష్టం లేదు. ఇక ఆయన సినిమా కెరీర్ గురించి మాత్రమే చెప్పాల్సి వస్తే పెద్దగా సినిమా ఎలిమెంట్స్ దొరకవు. ఒకవేళ అక్కడ కొన్ని విషయాలను చెప్పలేము, వాటివల్ల కొంతమంది మంది వ్యక్తులకు ఇబ్బంది కలుగవచ్చు అందుకే ఆయన బయో పిక్ ఆలోచన లేదు.

ఒకవేళ ఎవరైనా తీయాలనుకుంటే మేమే మా సంస్థ ద్వారా తీస్తాము అంటూ చెప్పారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇది పూర్వం నుండి ఉన్నదే, చరిత్ర చూసుకుంటే ఎప్పటినుండో ఉంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడవాళ్లు హక్కుల కోసం పోరాడడం వల్ల ఈ విషయం కొత్తగా చెప్పుకుంటున్నాం. ఇక ఒకరికి ఇష్టం లేకుండా ఒత్తిడి చేసి సంబందం పెట్టుకోవాలని అనుకోవడం తప్పు. ఇక మన జీవిత భాగస్వామిని మోసం చేయడం కూడా తప్పే నేను వీటిని బలంగా నమ్ముతాను అందుకే నా మీద ఎలాంటి రూమర్స్ ఎపుడూ రావు, నా జీవితంలో కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటిస్తాను అంటూ చెప్పారు.


































