Surya Kiran : సినిమా వాళ్ళు ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోడం ఇక ఆపై విడిపోడానికి ఎంతో సమయం పట్టదు. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారు. ఇదంతా ఇండస్ట్రీ లో కామన్ అనే వినిపిస్తుంది. వాళ్ళు విడిపోడానికి ఆర్ధిక సమస్యలు, కెరీర్ ముఖ్యంగా కారణాలు అవుతాయి. ఇక హీరోయిన్ కళ్యాణి, దర్శకుడు సూర్య కిరణ్ ల విషయంలోను కారణాలు స్పష్టంగా తెలియక పోయినా ఆర్థిక కారణాలే విడిపోడానికి కారణం అయ్యూండొచ్చని అందరి అభిప్రాయం.

కళ్యాణి ఆస్తులు నేను ముట్టుకోలేదు…
సూర్య కిరణ్ ‘సత్యం’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఆపై కెరీర్ సూపర్ గా ఉంటుందనుకున్నాడు కానీ అలా జరగలేదు, తీసిన సినిమాలేవి పెద్దగా ఆడలేదు. ఇక అప్పటికి హీరోయిన్ కళ్యాణిని పెళ్లి చేసుకున్నాడు. ఒక సినిమా స్వయంగా ప్రొడ్యూస్ చేసి ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. అయితే కళ్యాణి తో విడాకుల తరువాత బయటికి వినిపించిన విషయం కళ్యాణి ఆస్తులను కూడా కరిగించాడని అందువల్లే విడాకులు అయ్యాయని. కానీ అలాంటిదేమి లేదని సూర్య కిరణ్ క్లారిటీ ఇచ్చాడు. కళ్యాణి నే స్వయంగా ఒక ఇంటర్వ్యూ లో తెలిపిందని చెప్పాడు.

నా ఆస్తులన్నీ అయిపోయాయి. హైదరాబాద్ లో ఇల్లు, కేరళలో ఇల్లు అన్ని పోయాయి. ఒక్క బోట్ హౌస్ మాత్రం కళ్యాణి, నాది ఉమ్మడి ఆస్తి అది మాత్రం నేను తీసుకున్నా. ఇక మిగతా తన ఆస్తి నేను ముట్టుకోలేదు. కళ్యాణి చాలా మంచి అమ్మాయి. మా అమ్మ, నా చెల్లి, కళ్యాణి వీళ్లంటే నాకు ఇష్టం అంటూ చెప్పాడు. కళ్యాణి ఆస్తులన్నీ వాళ్ళ అమ్మ మేనేజ్ చేస్తుంది అందులో తప్పేం లేదు. నాచెల్లి విషయంలో మా అమ్మ అలానే వ్యవహారిస్తుంది అని క్లారిటీ ఇచ్చాడు.



























