Surya : 1997 లో ‘నేరుక్కు నేర్’ అనే సినిమాతో తన కెరీర్ని ప్రారంభించిన సూర్య, అంచెలంచెలుగా ఎదుగుతూ తమిళ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. సూర్య నటించిన సూపర్ హిట్ సినిమా ‘గజినీ’ ద్వారా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చికున్నారు. ప్రస్తుతం సూర్య ‘వాడీవాసల్’ అనే సినిమా చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా ఈ సినిమా షూటింగులో బిజీ గా ఉన్న సూర్య కాస్త విరామం తీసుకొని కుటుంబంతో సమయం గడుపుతున్నారు.

మా పిల్లలను వదిలేయండి…
సినిమా షూటింగులతో బిజీ గా వుండే మన హీరోలు కొద్దిగా తీరిక దొరకగానే ట్రిప్పులకు చెక్కెయడం, కుటుంబంతో సరదాగా గడపడం మామూలే. ఇలానే హీరో సూర్య కూడా వాడీవాసల్ సినిమా షూటింగు నుండి విరామం తీసుకొని కుటుంబంతో ముంబయిలో గడుపుతున్నారు. అయితే కుటుంబంతో కలసి సూర్య ముంబయిలో బాస్టియనల్ వోర్లీ హోటల్ కు వెళ్లగా, హోటల్ నుండి బయటకు వచ్చేపుడు మీడియా పలకరించి, ఫోటోలు అడగడంతో జ్యోతిక సూర్య ఇద్దరు ఫోటోలకు ఫోసులు ఇచ్చారు.

ఫోటోలు అయిపోగానే జ్యోతిక సూర్య కారు దగ్గరకు వెళుతుండగా, మీడియా అత్యుత్సాహంతో వారి పిల్లల దగ్గరికి ఫోటోల కోసం వచ్చారు. అయితే సూర్య వెంటే కెమెరా కి చేతులు అడ్డం పెడుతూ మా పిల్లలను వదిలేయండి… అని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో వైరల్ అవుతోంది.

































