Movie News

Sushant Singh Rajputh: సుశాంత్ మరణించి రెండున్నరేళ్ళవుతున్నా ఇప్పటికీ ఖాళీగా ఉన్న ఫ్లాట్… ఇంట్లో దిగాలంటే భయపడుతున్న జనం !!

Sushant Singh Rajputh: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి ఇంకా అభిమానులు బయటపడలేకపోతున్నారు.ఈయన తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే ఈయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోయినప్పటికీ ఈయన మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ మాఫియా వెలుగులోకి వచ్చింది.

ఇలా సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ మాఫియా బయటకు రావడంతో కొన్ని నెలలుగా సుశాంత్ మరణం హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సుశాంత్ మరణించి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా ఈయన చనిపోయే ముందు నివాసం ఉన్నటువంటి ఇంటికి ఎవరు అద్దెకు రాలేదని తెలుస్తోంది.

సుశాంత్‌ 2020, జూన్‌ 14 బాద్రాలోని తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన మరణం తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు అద్దెకు రాలేదని తెలుస్తోంది. తాజాగా ఇంటి బ్రోకర్ ఆ ఇల్లు ఖాళీగా ఉందని ఎవరికైనా కావాల్సి ఉంటే క్రింది నెంబర్లకు సంప్రదించండి అంటూ ఫోన్ నెంబర్లు కూడా పోస్ట్ చేశారు. దీంతో ఆ ఇల్లు ఇప్పటికి ఖాళీగా ఉందని అర్థమవుతుంది.

Sushant Singh Rajputh: భయంతో అద్దెకు రాలేదు..

ఈ విధంగా ఈ ఇల్లు ఇప్పటి వరకు ఖాళీగా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈ ఇంట్లో సుశాంత్ ఆత్మ తిరుగుతుందని, ఒక పుకారు పుట్టించారు. దీంతో ఆ ఇంట్లో ఉండాలని ఆసక్తి చూపినప్పటికీ ఈ విషయం తెలిసి కొందరు ఇంట్లోకి రావడానికి భయపడుతున్నారు.అదేవిధంగా ఇంటి ఓనర్ నెలకు 5 లక్షల రూపాయలకు ఏమాత్రం తగ్గదని చెప్పడంతో అంత మొత్తంలో అద్దె చెల్లించుకోలేక ఇప్పటివరకు ఎవరు కూడా ఈ ఇంటిలోకి అద్దెకు దిగలేదని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

2 hours ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

2 hours ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

3 hours ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

3 hours ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

3 hours ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

3 hours ago