Sushant Singh Rajputh: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి ఇంకా అభిమానులు బయటపడలేకపోతున్నారు.ఈయన తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే ఈయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియకపోయినప్పటికీ ఈయన మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ మాఫియా వెలుగులోకి వచ్చింది.

ఇలా సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ మాఫియా బయటకు రావడంతో కొన్ని నెలలుగా సుశాంత్ మరణం హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే సుశాంత్ మరణించి రెండున్నర సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా ఈయన చనిపోయే ముందు నివాసం ఉన్నటువంటి ఇంటికి ఎవరు అద్దెకు రాలేదని తెలుస్తోంది.
సుశాంత్ 2020, జూన్ 14 బాద్రాలోని తన అద్దె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన మరణం తర్వాత ఆ ఇంట్లోకి ఎవరు అద్దెకు రాలేదని తెలుస్తోంది. తాజాగా ఇంటి బ్రోకర్ ఆ ఇల్లు ఖాళీగా ఉందని ఎవరికైనా కావాల్సి ఉంటే క్రింది నెంబర్లకు సంప్రదించండి అంటూ ఫోన్ నెంబర్లు కూడా పోస్ట్ చేశారు. దీంతో ఆ ఇల్లు ఇప్పటికి ఖాళీగా ఉందని అర్థమవుతుంది.

Sushant Singh Rajputh: భయంతో అద్దెకు రాలేదు..
ఈ విధంగా ఈ ఇల్లు ఇప్పటి వరకు ఖాళీగా ఉండడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఈ ఇంట్లో సుశాంత్ ఆత్మ తిరుగుతుందని, ఒక పుకారు పుట్టించారు. దీంతో ఆ ఇంట్లో ఉండాలని ఆసక్తి చూపినప్పటికీ ఈ విషయం తెలిసి కొందరు ఇంట్లోకి రావడానికి భయపడుతున్నారు.అదేవిధంగా ఇంటి ఓనర్ నెలకు 5 లక్షల రూపాయలకు ఏమాత్రం తగ్గదని చెప్పడంతో అంత మొత్తంలో అద్దె చెల్లించుకోలేక ఇప్పటివరకు ఎవరు కూడా ఈ ఇంటిలోకి అద్దెకు దిగలేదని తెలుస్తోంది.

































