Tabu : 1980 లో మొదట బాలీవుడ్లో బజార్, హమ్ నే జవాన్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెమెరా ముందు నటించింది టబు. హిందీలో రూప్ కి రాణి చోరోంకా రాజా, ఫ్రేమ్ లలో తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నం.1 సినిమాతో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. అయితే మొదటి సినిమాతోనే తెలుగులో అభిమానులని ఆకట్టుకుంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో నటించింది టబు. హిందీలో చేసిన ‘మాచీస్’ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని కూడా అందుకుంది. ఆచి తూచి కథల్ని ఎంపిక చేసుకుంటుంది టబు, అందుకే ఇన్నేళ్ల కెరీర్లో కొన్ని సినిమాలలోనే నటించింది. కానీ నటిగా మంచి పేరు సంపాదించుకుంది.

పెళ్లి కాకపోయినా.. తల్లి కాకపోయినా చచ్చిపోరు…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు పెళ్లి, పిల్లలు కనడం గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లల్ని కనాలి తల్లి అవ్వాలి అని నాకు ఉంది, దానికోసం పెళ్లి చేసుకోవాల్సిన పని లేదు. పెళ్లి కాకుండా కూడా పిల్లల్ని కనవచ్చు. ఇప్పుడు సరోగసి ద్వారా చాలా మంది పిల్లల్ని కంటున్నారు. నేను కూడా అలా పెళ్ళి కాకుండానే పిల్లల్ని కంటే ఎవరు ఆపగలరు అని చెప్పుకొచ్చింది.

ఇక పెళ్ళి గురించి ప్రస్థావించినపుడు… మహిళలను అన్ని విధాల గౌరవించేవాడు, నా మనసుకు నచ్చినవాడు దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పుకొచ్చింది. వయసు గురించి ప్రస్థావిస్తే పెళ్ళికి పిల్లలకు ఈ రోజుల్లో వయసు సమస్య కాదు అని చెప్పారు. అంతేకాకుండా పెళ్లి, పిల్లలు లేకపొతే ఎవరూ చచ్చిపోరు అని సంచలన వ్యాఖ్యలు చేసింది.



































