Tabu : ప్రేమదేశం సినిమాతో కుర్రకారు మనసు దోచిన టబు అటు తెలుగులోనూ నాగార్జున, వెంకటేష్ సరసన మంచి హిట్ సినిమాలు చేసింది. చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బాలీవుడ్ లో బాగా అవకాశాలు రావడంతో ఇక దక్షిణాది వైపు చూడలేదు ఈ ముద్దుగుమ్మ. ఉత్తరాది హీరోయిన్ గానే గుర్తింపు తెచ్చుకున్న టబు సొంతూరు మాత్రమే హైదరాబాద్. హైదరాబాద్ లోని ముస్లిం కుటుంబంలో జన్మించిన టబు అసలు పేరు తుబస్సుమ్ ఫాతిమా హష్మీ. 1971 లో జన్మించిన టబు ఇంక పెళ్లి చేసుకోలేదు. ఇక దీనికి కారణం నాగార్జునతో ఉన్న ఎఫైర్ అంటూ ఇప్పటికి వార్తలు వినిపిస్తుంటాయి.

అందుకే హైదరాబాద్ కి వస్తుంటా….
నాగార్జునకు టబుకి మధ్య ఏదో ఉంది అని చాలా కాలంగా వార్తలు వస్తున్నా ఈ విషయం ఒక గాసిప్ గానే ఉండిపోయింది. నిన్నే పెళ్లాడుతా సినిమాతో వీళ్లిదరు మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఆ తరువాత ఆవిడా మా ఆవిడే సినిమాలో కూడా నటించారు. అయితే నిన్నే పెళ్లాడుతా సినిమాలో నాగార్జున, టబు మధ్య రొమాన్స్ బాగా వర్క్ అవుట్ అయింది. ఇంకేముంది వీళ్లిద్దరి మధ్య ఏదో ఉందనే పుకార్లు చక్కర్లు కొట్టాయి.

ఇక బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండే టబు తరచూ హైదరాబాద్ రావడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన టబుకి నాగార్జునతో ఎఫైర్ గురించి ప్రశ్న ఎదురైంది. హైదరాబాద్ తరచూ నాగార్జున కోసం వస్తున్నారా అంటూ అడిగారు. అయితే టబు స్పందించి నాగార్జున నేను మంచి స్నేహితులం అది తప్పితే ఇంకేం లేదని చెప్పింది. ఇక హైదరాబాద్ రావడానికి కారణం ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయడమే కారణమని వివరించింది. ఇక ఇటీవలే అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ చిత్రం అలా వైకుంఠపురంలో సినిమాలో బన్నీకి తల్లిగా నటించి తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. ఇక సినిమాతో మంచి పేరు కుడా తెచ్చుకుంది.



































