Tag Archives: ap government

ఏపీ ప్రజలకు శుభవార్త .. సంచలన నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఇంధన సర్దుబాటు ఛార్జీలను ( ట్రూ-అప్ ఛార్జీలను)నవంబర్ నెలలో వసూలు చేశారు. వాటిని డిసెంబర్ లో వచ్చే బిల్లులో నవంబర్ నెలకు సంబధించి రిఫండ్ ఛార్జీలను సర్దుబాటు చేసి.. డిసెంబర్ లో బిల్లులను వినియోగదారులకు పంపిస్తామన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసిన ట్రూ-అప్ ఛార్జీలను తిరిగి చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి డిస్కమ్‌లకు కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. డిస్కమ్‌లు ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వినియోగదారుల నుండి మొత్తం సేకరించాయి.

మెజారిటీ సంస్థలు, సంఘాలే కాకుండా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ట్రూ-అప్ ఛార్జీల వసూలును వ్యతిరేకించాయి. కోవిడ్ సంక్షోభం కారణంగా ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఎత్తి చూపుతూ వారు APERCకి అభ్యర్థనలను సమర్పించారు. ట్రూ-అప్ ఛార్జీలను వసూలు చేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు.

దీనిలో భాగంగానే.. ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో నవంబర్‌ నెల బిల్లుల నుంచే ట్రూ అప్‌ ఛార్జీలను వినియోగదారులకు తిరిగి వెనక్కి చెల్లిస్తూ సర్దుబాటు ప్రక్రియ ప్రారంభించారు. ఏపీఈపీడీసీఎల్‌ డిసెంబర్‌ నుంచి చేపట్టింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 1.86 కోట్ల మంది వినియోగదారులకు ఊరట లభించింది. సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్. బాబురావు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. తమ కృషికి మంచి ఫలితాలు వచ్చాయన్నారు.

జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన మెగాస్టార్.. మా అధ్యక్షుడు ఎక్కడా అంటూ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై సినీ పెద్ద మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఆన్లైన్ టికెటింగ్ బిల్లు పెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని చెబుతూనే.. టికెట్ల రేట్లను కాలాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం కల్పించి ఉంటే మరింత బాగుండేదని చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఈ క్రమంలోనే సినిమా టికెట్ల విషయం గురించి అన్ని రాష్ట్రాలలో ఉండే వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉండాలని ఆయన కోరారు.ఇలా చిరంజీవి చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పోరాడాలని విజ్ఞప్తి చేయకూడదంటూ చేసిన వ్యాఖ్యలను కొందరు గుర్తు చేశారు. ఈ విధంగా సినీ పెద్దగా వ్యవహరించిన చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రికి ట్వీట్ చేయడంతో కొందరు నెటిజనులు స్పందిస్తూ ఈ వ్యవహారం మధ్యలోకి మా అధ్యక్షుడు మంచు విష్ణును లాగారు.

ఇండస్ట్రీలో ఏదైనా ఆపద వస్తే ప్రతి ఒక్క సెలబ్రిటీ ఏకమై ఆ సమస్యను పరిష్కరించాలి.మరి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితులలో ముందుండి నడిపించాల్సిన మా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లారు.సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంచు విష్ణు ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వానికి షాక్.. 13 మంది వైసీపీ సర్పంచ్ లు రాజీనామా..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేసుకుంటూ.. ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. పలు సంక్షేమ పథకాలతో పాటు.. ప్రతీ గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే పరిష్కారం చూపుతూ పాలన సాగిస్తున్నారు. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన జగన్ ప్రభుత్వం.. ఆ ఫలితాన్ని ఇటీవల జరిగిన 13 మున్సిపల్ ఎన్నికల్లో చూశారు.

ఒక్క మున్సిపాలిటీ తప్ప అన్నీ కైవసం చేసుకున్నారు. ఈ ఘనత అంత ప్రజలదే అని.. వాళ్లు తమకు 100 కు 97 మార్కులు ఇచ్చారని.. ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. ఇదంతా ఇలా ఉండగా.. కడప జిల్లాలోని వైసీపీ సర్పంచ్ లు మూక్కుముడిగా రాజీనామా చేశారు. ఇది ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మరింది.

మంచి జోష్ లో ఉండి.. ముందుకు దూసుకపోతున్న వైసీపీకి ఇది పెద్ద షాకింగ్ అనే చెప్పాలి. అసలెందుకు వాళ్లు ఈ పిని చేశాడు.. అసలేమైందంటే.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.. కడప జిల్లా కాజీపేట మండలంలో వైసీపీ సర్పంచులు గ్రామ పంచాయతీకి నిధులు రావడం లేదన్న ఆవేదనతో 13 మంది వైసీపీ సర్పంచులు ఒకేసారి రాజీనామా చేశారు. నిధులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని.. చేతి నుంచి డబ్బులను పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రమాణం స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని అన్నారు. ఇంకా చాలామంది రాజీనామాలకు సిద్ధ పడ్డారని.. ప్రభుత్వంపై రాజీలేని పోరాటానికి తాము సిద్ధం అంటూ తెలిపారు.

తిరుపతి వరదలపై ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి విజ్ఞప్తి చేసిన మెగాస్టార్..!

గత వారం రోజుల నుంచి తీవ్ర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తీవ్రమైన వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే గతంలో ఎప్పుడు చూడని విధంగా తిరుమల తిరుపతిలో భారీ వర్షాల కారణంగా తిరుపతి మొత్తం జల సందిగ్దంలో ఉండిపోయింది. ఈ క్రమంలోనే తిరుపతి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఈ వరద నీటిలో భాగంగా ఎన్నో వాహనాలు పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తిరుమల గిరుల నుంచి వర్షపు నీరు జలపాతంగా ప్రవహించడంతో తిరుపతి వీధులన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే జనజీవనం స్తంభించిపోయి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు . ఇదిలా ఉండగా తాజాగా తిరుపతి వరదలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి ద్వారా స్పందిస్తూ గతంలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం టిటిడి కలిసికట్టుగా కృషి చేసి వీలైనంతవరకు పరిస్థితులను సాధారణ స్థితికి రావాలని ఏపీ ప్రభుత్వానికి టిటిడికి చిరు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాలని ఈ సందర్భంగా చిరు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వరద ముంచెత్తుతోంది. ఈ క్రమంలోనే పలు వాగులు వంకలు పొంగి పొర్లి జనజీవనం స్తంభించిపోయింది. ఇక చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వైయస్సార్ రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ కాలేదా.. ఏం చేయాలంటే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా అమలు చేస్తున్న స్కీమ్ లలో వైయస్సార్ రైతుభరోసా స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ సంవత్సరానికి 13,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేస్తోంది. ఈ 13,500 రూపాయలలో కేంద్రం నుంచి 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమవుతాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఈ నెల 25వ తేదీన పీఎం కిసాన్ స్కీమ్ నగదు జమ కాగా ఆ స్కీమ్ ద్వారా 2,000 రూపాయలు జమ కాని రైతుల ఖాతాలలో జగన్ సర్కార్ 29వ తేదీన 2,000 రూపాయల చొప్పున 1,766 కోట్ల రూపాయలు జమ చేసింది. అర్హులైన రైతుల ఖాతాలలో ఈ మొత్తం జమైంది. రైతు భరోసా నగదుతో పాటు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు 646 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తోంది.

అయితే ఇప్పటికే ప్రభుత్వం నగదు జమ చేయగా ఏదైనా కారణం వల్ల నగదు క్రెడిట్ కాకపోతే 155251 హెల్ప్‌లైన్‌ నెంబర్‌ కు కాల్ చేయడం ద్వారా నగదు ఎందుకు జమ కాలేదనే వివరాలను తెలుసుకోవచ్చు. వైఎస్సార్ రైతుభరోసా స్కీమ్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఈ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలను పొందవచ్చు. రైతులకు పెట్టుబడి సాయంలో భాగంగా జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఈ స్కీమ్ తో పాటు జగన్ సర్కార్ వైయస్సార్ రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. ఈ స్కీమ్ కు అర్హులై ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోకపోతే గ్రామ, వార్డ్ వాలంటీర్లను సంప్రదించి సరైన ధృవపత్రాలను సమర్పించి దరఖాస్తు చేసుకోవచ్చు.

రైతులకు జగన్ సర్కార్ శుభవార్త.. ఒకేరోజు రెండు పథకాల డబ్బులు..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు అదిరిపొయే శుభవార్త చెప్పింది. వైఎస్సార్ రైతుభరోసా పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జగన్ సర్కార్ ఈ నెల 29వ తేదీన జమ చేయనున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 50 లక్షలకు పైగా రైతులు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందనున్నారు. జగన్ సర్కార్ ఈ స్కీమ్ కింద రైతుల ఖాతాల్లో 2 వేల రూపాయలు జమ చేయనుంది.

అయితే తాజాగా జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. రైతు భరోసా స్కీమ్ నగదుతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ డబ్బులను సైతం అదే రోజు రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదట జగన్ సర్కార్ ఈ నెల 27వ తేదీన ఇన్ పుట్ సబ్సిడీ నగదును రైతుల ఖాతాలలో జమ చేయాలని భావించింది. అయితే రెండు రోజుల వ్యవధిలో రెండు స్కీమ్ ల నగదు జమ చేసే కంటే ఒకేరోజు రెండు స్కీమ్ ల నగదు జమ చేస్తే మంచిదని ప్రభుత్వం భావించింది.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా కొత్త సంవత్సరానికి రెండు రోజుల ముందే రైతుల ఖాతాలలో నగదు జమ కానుంది. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా జగన్ సర్కార్ స్కీమ్ లను అమలు చేస్తూ ఉండటంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి జగన్ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకుంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం రైతులకు తీపికబరు చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 7వ విడత నిధులను ఈ నెల 25వ తేదీన జమ చేయనుంది. దేశంలోని 9 కోట్ల మంది రైతుల ఖాతాలలో నగదు జమ కానుందని తెలుస్తోంది.

ఏపీ వాహనదారులకు షాకింగ్ న్యూస్.. జనవరి 1 నుంచి భారీ జరిమానాలు..?

జగన్ సర్కార్ కొన్ని రోజుల క్రితం రోడ్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇకపై వాహనదారుల దగ్గర వాహనానికి సంబంధించిన పత్రాలు లేకపోతే రవాణాశాఖ అధికారులు కేసులు నమోదు చేస్తారు. కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల మోదీ సర్కార్ డిసెంబర్ నెల వరకు పర్మిట్లు, రిజిస్ట్రేషన్లు, లైసెన్స్ ల గడువు తీరినా చెల్లుబాటయ్యేలా ఆదేశాలు జారీ చేసింది.

డిసెంబర్ 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కిందిస్థాయి అధికారులకు జనవరి 1వ తేదీ నుంచి నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం వల్ల ఇకపై చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరంగా జరగనున్నాయి. ప్రభుత్వం 2019 సంవత్సరంలో వాహనదారులకు షాక్ ఇచ్చేలా మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం నిబంధనలకు అనుగుణంగా జరిమానాలను భారీగా పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, బండికి సంబంధించిన పత్రాలలో ఏది లేకపోయినా భారీగా జరిమానాలను చెల్లించాల్సి ఉంటుంది. వాహనదారులు పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ పై అనర్హత వేటు వేయడంతో పాటు జైలు శిక్షలు విధించే అవకాశాలు ఉంటాయి.

కొత్త ఏడాదిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. పన్నులు చెల్లించకుండా వాహనం నడిపినా, పర్మిట్లు లేకపోయినా రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రవాణాశాఖ సుప్రీం కోర్ట్ రోడ్ సేఫ్టీ కమిటీకి జనవరి 1 నుంచి నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

ఏపీ రైతులకు జగన్ గుడ్ న్యూస్.. ఖాతాల్లో నగదు జమ చేయనున్న ప్రభుత్వం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ జలకళ, రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక విధాలుగా జగన్ సర్కార్ ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని రైతులు లబ్ధి పొందుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ రైతులకు రెండు శుభవార్తలు చెప్పింది.

వైఎస్సార్ జలకళ స్కీమ్ కు సంబంధించిన నిబంధనలలో జగన్ సర్కార్ కీలక మార్పులు చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం రైటైర్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్ జలకళ స్కీమ్ కు అర్హత పొందలేరు. రెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండున్నర ఎకరాల భూమి లేకపోతే రైతులు గ్రూపుగా ఏర్పడి వైఎస్సార్ జలకళ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఒక కుటుంబంలో ఒకరు ఈ స్కీమ్ కు అర్హత పొందితే మరొకరు ఈ స్కీమ్ కు అర్హత పొందలేరు. మరోవైపు జగన్ సర్కార్ రాష్ట్రంలో నేటి నుంచి వైఎస్సార్ పంటల బీమా స్కీమ్ ను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 9.50 లక్షల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తుండగా 1252 కోట్ల రూపాయలు బీమా పరిహారం రూపంలో రైతులకు అందుతుంది. బీమా పొందిన రైతులకు వారి మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తాయి.

జగన్ సర్కార్ ప్రతి ఎకరాన్ని ఈ క్రాప్ లో నమోదు చేయించడంతో పాటు నష్టపోయిన రైతులకు ఖాతాలలో నగదును జమ చేస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి నగదు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలో జమవుతుంది.

విద్యార్థుల తల్లిదండ్రులకు అలర్ట్.. వాళ్లకు మాత్రమే అమ్మఒడి..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా సంచాలకుడు వాడ్రేవు చినవీరభద్రుడు అమ్మఒడి స్కీమ్ గురించి కీలక ప్రకటన చేశారు. 2020 – 2021 సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు తమ వివరాలను వెబ్ పోర్టల్ ద్వారా చెక్ చేసుకోవాలని సూచించారు.

అధికారులతో ఈ స్కీమ్ గురించి సమీక్ష నిర్వహించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఈ స్కీమ్ కు అర్హులు. విద్యార్థుల తల్లిదండ్రులు వెబ్ పోర్టల్ లో నమోదైన బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్, రైస్ కార్డు నెంబర్ అన్నీ చెక్ చేసుకోవాలి. అన్నీ సరిగ్గా ఉంటే ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

ఏవైనా తప్పులు ఉంటే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి తప్పులు సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అర్హులైన విద్యార్థినీవిద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000 రూపాయల చొప్పున జమ చేస్తోంది. అర్హులైన వారికి జనవరి నెల తొలి వారంలో అమ్మఒడి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో జమవుతాయి. ప్రభుత్వం గతేడాది నుంచి అమ్మఒడి స్కీమ్ ను అమలు చేస్తోంది.

ఈ నెల 15వ తేదీలోగా అరులైన విద్యార్థులు వివరాలను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దారిద్రరేఖకు దిగువన ఉండి బియ్యం కార్డ్ ఉన్నవారు మాత్రమే ఈ స్కీమ్ కు అర్హులవుతారు. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల డేటాను పంపాలంటే విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావాలని నిబంధనలు విధిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. డీఎస్సీ ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలో నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది. పాఠశాల విద్యాశాఖ త్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందుకోసం త్వరలో పరీక్ష నిర్వహించాల్సి ఉండగా పరీక్షల నిర్వహణ కోసం జగన్ సర్కార్ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో 403 పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.

పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జిల్లాలవారీగా ఖాళీలకు సంబంధించిన వివరాలను సేకరిస్తుండగా త్వరలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం రాష్ట్రంలో వేల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. అధికారులు త్వరలో టెట్ పరీక్ష కూడా నిర్వహించనున్నారని.. టెట్ నిర్వహణ కొరకు అధికారులు కసరత్తులు చేస్తున్నారని తెలుస్తోంది.

టెట్ పరీక్ష నిర్వహణ కోసం పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారని.. రాష్ట్ర విద్య ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ మండ‌లి ఈ సంవత్సరం పాఠ్య ప్రణాళికలో మార్పులు చేయనుందని.. ఎన్‌సీఈఆర్‌టీ ఈ బాధ్యతలను తీసుకుందని సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉండటంతో పరీక్షల్లో కూడా ఆ మేరకు మార్పులు జరగనున్నాయని తెలుస్తోంది.

ఉపాధ్యాయ బ‌దిలీల ప్ర‌క్రియ అనంతరం టెట్ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నాయని.. త్వరలో టెట్, డీఎస్సీల గురించి విద్యాశాఖ అధికారుల నుంచి ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.