Tag Archives: business

Pawan Kalyan: జగన్ సారా వ్యాపారి.. వచ్చేది రామ రాజ్యమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్!

Pawan Kalyan: టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో చిలకలూరిపేట స‌మీపంలోని బొప్పూడిలో నిర్వ‌హించిన ప్రజాగళం భారీ సభను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాబోయే కురుక్షేత్ర సమరం తర్వాత ఏపీలో రాబోయేది రామ రాజ్యమేనని తెలిపారు. ప్రస్తుతం రావణాసురు పాలన సాగుతుందని త్వరలోనే రామరాజ్యం వస్తుందని వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి అధికారం డబ్బు అండతో విర్రవీగిపోతున్నారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి రేటు పూర్తిగా పడిపోయిందని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఒక సంక్షేమం లేదని అభివృద్ధి జరగలేదని నిరుద్యోగం పెరిగిపోయిందని తెలిపారు. ఈ కురుక్షేత్ర యుద్ధం తర్వాత రామరాజ్యం రాబోతుందని తెలిపారు. ఇక దేశమంతా డిజిటల్ రంగంలో ముందుకు దూసుకుపోతూ ఉండగా జగన్మోహన్ రెడ్డి మాత్రం మద్యం దుకాణాల వద్ద ఇంకా నగదు బదిలీ చేపడుతూ భారీగా దోచుకుంటున్నారని తెలిపారు. ఈయన ఒక సారా వ్యాపారి అంటూ పవన్ ఎద్దేవా చేశారు.

డ్రగ్స్ రాజధాని..
కేవలం మద్యం విషయంలో మాత్రమే కాదు ఇసుక తవ్వకాలలో కూడా జగన్ బినామీలు సుమారు 40 వేల కోట్ల వరకు దోచుకున్నారని పవన్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాజధానిగా మారిపోయింది అంటూ జగన్ పరిపాలనపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కురిపిస్తూ చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా పవన్ తమ గెలుపు పట్ల ధీమా వ్యక్తం చేశారు.

Venuswamy: వేణు స్వామితో జాతకం చెప్పించుకోవాలంటే అన్ని నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలా?

Venuswamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన జ్యోతిష్యులుగా ఇటీవల కాలంలో బాగా ఫేమస్ అయ్యారు. ఎప్పుడైతే సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పారో ఆ క్షణమే ఈయన పాపులర్ అయ్యారు.అయితే ఈయన చెప్పిన విధంగా సమంత నాగచైతన్య విడిపోవడంతో వేణు స్వామిని నమ్మే వారి సంఖ్య అధికమైంది.

ఇలా నిత్యం అందరి జాతకాలను చెబుతూ వార్తలలో నిలుస్తున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో ఈయన చెప్పిన జాతకాలు కాస్త అటు ఇటు తేడా కావడంతో పలువురు ఈయన జాతకాలపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వేణు స్వామి తన గురించి పలు విషయాలను వెల్లడించారు.

తాను కేవలం జ్యోతిషం మాత్రమే చెబుతూ బతకలేదని తెలిపారు. నాకు వైన్ షాప్స్ ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ బిజినెస్ లను చేస్తున్నానని తెలిపారు .ఇలా వీటన్నింటిని చూసుకుంటూ నా ఫ్యామిలీకి కూడా కొంత సమయం కేటాయిస్తూ ఉంటానని తెలిపారు. అందుకే నా దగ్గర ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి అంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

రియలేస్టేట్ వ్యాపారం…
ఇక వేణు స్వామి వద్ద అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఎనిమిది నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుందంటూ తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది వేణు స్వామిని సంప్రదించడం కోసం మనం ఫోన్ చేస్తే తన అసిస్టెంట్లు మనకు ఫలానా తేదీ అపాయింట్మెంట్ ఇస్తారని అంతకు ముందు రోజు వాళ్ళు ఫోన్ చేసి మనకు గుర్తు చేస్తారు అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి తన బిజీ షెడ్యూల్ గురించి చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Nagarjuna: కోట్ల రూపాయలు ఇస్తూ పెళ్లిళ్లకు రమ్మని పిలుస్తున్నారు.. నాగార్జున కామెంట్స్ వైరల్!

Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు నాగార్జున ఒకరు. అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి నాగార్జున ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పటికి నాగర్జున వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకు సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా నాగార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఒక బిజినెస్మెన్ ఇంట్లో కనుక పెళ్లి జరిగితే పెద్ద ఎత్తున సెలెబ్రిటీలను ఆహ్వానిస్తూ ఉంటారు అయితే సెలబ్రిటీలకు కొన్ని కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చి వారిని పెళ్లికి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.

కేవలం 20 నిమిషాలు పెళ్లిలో కనిపించి ఒక ఐదు నిమిషాల పాటు పెర్ఫార్మెన్స్ చేస్తే చాలు వారికి కోట్లలో డబ్బులు చెల్లిస్తున్నారంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గతంలో తనకి కూడా ఇలాంటి ఆహ్వానాలు అందాయని కానీ తాను మాత్రం వెళ్లలేదని నాగార్జున తెలిపారు.

డబ్బు తీసుకొని వస్తున్నారు…
ఇక ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు పెళ్లి వేడుకలలో పెద్ద ఎత్తున బాలీవుడ్ సెలబ్రిటీలు మూడు రోజుల పాటు సందడి చేసిన సంగతి తెలిసిందే దీంతో వీరందరూ కూడా రెమ్యూనరేషన్ తీసుకొని అక్కడికి వచ్చారని వాదన వినిపిస్తున్నటువంటి తరుణంలో నాగార్జున చేసినటువంటి కామెంట్స్ కి సంబంధించిన ఓల్డ్ వీడియోని కూడా వైరల్ చేస్తున్నారు.

Sandeep Kishan: కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్.. మద్దతుగా నిలిచిన టాలీవుడ్ అండ్ హీరో?

Sandeep Kishan: ఫుట్ పాత్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించి జీవనోపాధిని వెతుక్కున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. అయితే ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు ఎగబడ్డారు అయితే జనాలు మాత్రమే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా రావటం గమనార్హం.

ఈ విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఓ రేంజ్ లో పాపులర్ అవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఈమె ఫుడ్ టెస్ట్ చేసేవారు అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి ఈమె ఫుడ్ టెస్ట్ చేయడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలి రావడంతో భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా పోలీసులు ఈమె బిజినెస్ పట్ల చర్యలు తీసుకున్నారు. ఏకంగా తన బిజినెస్ క్లోజ్ చేయించారు.

ట్రాఫిక్ జామ్ అనేది పేరు మాత్రమేనని ఈమె ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటంతోనే ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయింది అనే వాదన కూడా తెరపైకి వచ్చింది ఏది ఏమైనా జీవనోపాధి కోసం ఫుట్ పాత్ పై ఫుడ్ విక్రయిస్తూ జీవనం గడుపుతున్నటువంటి ఈమె బిజినెస్ క్లోజ్ కావడంతో ప్రముఖ నటుడు సందీప్ కిషన్ ఈమెకు మద్దతుగా నిలిచారు.

ఎందరికోస్ఫూర్తి….

గత కొద్ది రోజుల క్రితం సందీప్ కిషన్ కుమారి ఆంటీ వద్దకు వెళ్లి ఆమె ఫుడ్ టెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రాఫిక్ జామ్ అవుతుందన్న కారణంగా ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయడం సరైంది కాదని తెలిపారు. ఎంతోమంది మహిళలకు ఆమె స్పూర్తిగా నిలిచారని సందీప్ కిషన్ కామెంట్లు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసిన బలమైన సాధికారత మహిళలలో కుమారి ఆంటీ కూడా ఒకరని తెలిపారు. వీలైనంతవరకు నేను నా టీం తో కలిసి తనకు సహాయం చేస్తాను అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Arjun Sarja: అర్జున్ సర్జా చిన్న కూతురి బిజినెస్ రూటే వేరు.. పండ్లతొక్కలతో అలాంటి వ్యాపారం?

Arjun Sarja: తెలుగు ప్రేక్షకులకు హీరో అర్జున్ సర్జా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు,కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అర్జున్ సర్జా. తెలుగులో కూడా ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు అర్జున్ సర్జా. కన్నడతో పాటు తెలుగులో కూడా ఈయనకు అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు హీరోగా నటించిన అర్జున్ ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన అర్జున్ సహాయ నటుడిగా, విలన్ పాత్రలు పోషిస్తున్నారు.

అయితే అర్జున్ సర్జా ఫ్యామిలీలో చాలా మంది హీరో హీరోయిన్లుగా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఆయన మేనల్లుడు ధృవ సర్జా హీరోగా రాణిస్తున్నారు. ఇక ఆయన పెద్దు కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కాగా ఐశ్వర్య సర్జా తొలిసారిగా విశాల్ సరసన పట్టతు యానై అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో ప్రేమ బరహ చిత్రంలో నటించింది. కథానాయికగా మంచి అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె పెళ్లికి సిద్ధమయ్యింది. ప్రముఖ హాస్యనటుడు తంబీ రామయ్య కొడుకు ఉమాపతి రామయ్యతో గత ఏడాది నిశ్చితార్థం జరిగింది.

అయితే గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరీ ఎంగేజ్మెంట్ వేడుక గత ఏడాది అక్టోబర్ 27న చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. త్వరలోనే వీరి పెళ్లి ఘనంగా జరగనుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అర్జున్ సర్జా చిన్న కూతురి గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. ఆయన చిన్న కుమార్తె పేరు అంజనా అర్జున్. తండ్రిలాగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకుండా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. పారిశ్రామికవేత్తగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‏లో హ్యాండ్‌బ్యాగ్‌ల తయారీ యూనిట్‌ను ప్రారంభించారు.

పండ్ల తొక్కలతో భారీ సంపాదన..

గతంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సంస్థను ప్రారంభించి అంజనా అర్జున్ ను అభినందించారు. అంతేకాదు హ్యాండ్ బ్యాగ్ తయారీలో అంజనా అర్జున్ రూటే సపరేటు. హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేయడానికి ముడి పదార్థంగా పండ్ల తొక్కలను ఉపయోగిస్తున్నారు. పండ్ల తొక్కలను వాడే ప్రత్యేకమైన ఫార్ములాతో ఆమె ఈ హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు. ఈ పద్దతి ప్రపంచంలో మునుపెన్నడూ ప్రయత్నించలేదు. అటు అంజనా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ బిజినెస్ కు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తు ఉంటుంది. చాలామంది ఆమె బిజినెస్ గురించి తెలిసి నిజంగా ఇది సరికొత్త ఐడియా, మంచి బిజినెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Mahesh Babu: సినిమాలు బిజినెస్.. మహేష్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున వ్యాపార సంస్థలను కూడా నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈయన నిర్మాతగా కూడా సినిమాలను నిర్మించడమే కాకుండా ఏషియన్ వారితో కలిసి హోటల్ బిజినెస్ అలాగే మల్టీ ఫ్లెక్స్ థియేటర్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా వీటి ద్వారా భారీ స్థాయిలో లాభాలను కూడా అందుకుంటున్నారు. సినిమాల ద్వారా డబ్బు సంపాదించి వాటిని బిజినెస్ లో పెట్టుబడి పెట్టడం బిజినెస్ ద్వారా కోట్లలో ఆదాయం పొందడం జరుగుతుంది.

ఈ విధంగా మహేష్ బాబు భారీగా సంపాదిస్తున్నప్పటికీ దానిలో కొంత భాగం మహేష్ బాబు ఫౌండేషన్ కోసం ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్ ద్వారా మహేష్ బాబు ఇప్పటికే వేల సంఖ్యలో చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మ అందించడమే కాకుండా బుర్రపాలెం దత్తత తీసుకొని గ్రామంలో మౌలిక సదుపాయాలు అన్నిటిని కూడా సమకూరుస్తూ ఉన్నారు.

లండన్ లో కూడా ఆస్తులు…

ఈయన వెండితెరపై మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు. ఇలా ఒక వైపు సినిమాలు మరోవైపు బిజినెస్ అంటూ ఈయన భారీగానే సంపాదిస్తున్నారు సుమారు 300 కోట్ల రూపాయల వరకు ఆస్తులు కూడా పెట్టారనే తెలుస్తుంది. కోట్ల విలువ చేసే కార్లు బంగ్లాలు ఉన్నాయి. కేవలం హైదరాబాదులోనే కాకుండా బెంగళూరులో కూడా కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది అయితే ఈయన ఇండియాలోనే కాకుండా లండన్ లో కూడా ఆస్తులు కొనుగోలు చేశారు అంటూ ఇదివరకు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Mahesh Babu: హైదరాబాద్లో మహేష్ బాబు రెస్టారెంట్ ఒకరోజు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు ఇప్పటికే థియేటర్ బిజినెస్ తో పాటు రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన ఏషియన్ వారితో కలిసి మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇటీవల హైదరాబాద్ బంజారాహిల్స్ లో రెస్టారెంట్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

00

ఏషియన్ నమ్రత ప్యాలెస్ హైలెట్స్ అనే పేరుతో బంజారాహిల్స్ లో ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే మహేష్ బాబు రెస్టారెంట్ అని మనం ఈ రెస్టారెంట్ కి వెళ్లి కనుక టిఫిన్ చేసాము అంటే మన జోబి కాలీ కావాల్సిందే. అంత రిచ్ గా ఈ హోటల్ నడుస్తుంది. ఒక కప్పు కాఫీ తాగాలన్న వందల్లో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది . ఒక ప్లేట్ ఇడ్లీ తినాలి అంటే 500 రూపాయల వరకు ఖర్చు చేయాలి.

ఇలా ఈ రెస్టారెంట్లో ప్రతిదీ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చెప్పాలి. ఇలా ఈ రెస్టారెంట్లో ఎక్కువ ధరలు అయినప్పటికీ ఎంతోమంది ప్రతి రోజు ఈ రెస్టారెంట్ కు వెళ్లి వాళ్లకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా నమ్రత మహేష్ రెస్టారెంట్ బిజినెస్ లో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే తాజాగా ఈ రెస్టారెంట్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

లక్షల్లో బిజినెస్…


ఈ రెస్టారెంట్ ఒకరోజులో భారీగానే బిజినెస్ జరుపుకుంటుందని తెలుస్తుంది. ఒక్క రోజుకు ఈ రెస్టారెంట్లో 8 లక్షల నుంచి 10 లక్షల వరకు బిజినెస్ జరుగుతుందంటూ ఒక వార్త వైరల్ గా మారింది. ఇలా రోజుకు 10 లక్షలు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఈ డబ్బుతో ఒక సాధారణ వ్యక్తి తనకు నచ్చినట్టుగా ఇంటిని కట్టుకోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Venu Swamy: ఆస్తులు చిట్టా మొత్తం బయటపెట్టిన వేణు స్వామి.. ఆస్తులు విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన తరచూ సెలబ్రిటీల జాతకాలని చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు రాజకీయ నాయకులు జీవితాలు గురించి ఎన్నో విషయాలు చెప్పినటువంటి వేణు స్వామి పలుమార్లు విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈయన చెప్పే జ్యోతిష్యం నిజం కాకపోవడంతో పలువురు ఈయన పట్ల విమర్శలు కురిపిస్తున్నారు.

ఇక ఇటీవల కెసిఆర్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫాన్స్ ఈయనపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మొదటిసారి వేణు స్వామి సంపాదించినటువంటి ఆస్తుల గురించి మాట్లాడుతూ ఈయన చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి తాను జాతకాలు చెప్పడంతో చాలామంది తనపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. జ్యోతిష్యం చెప్పేవాడు జాతకమే బాగుంటే ఇలా జ్యోతిష్యం ఎందుకు చెబుతారు అంటూ కొందరు కామెంట్లు చేసినట్లు వేణుస్వామి వెల్లడించారు.

ఇలా నా గురించి విమర్శలు చేసే వారికి నేను చెప్పే సమాధానం ఇదే నేను కేవలం జ్యోతిషం చెప్పి మాత్రమే బతకడం లేదని నాకు వైన్ షాప్స్ ఉన్నాయని నాకు రేంజ్ రోవర్ కార్ ఉంది కోట్ల విలువ చేస్తే ఇల్లు అలాగే, ఆస్తులు కూడా ఉన్నాయని ఈయన తెలిపారు. ఇక తన భార్య వీణ వాణి కూడా భారీగానే సంపాదిస్తుందని వేణు స్వామి తెలిపారు.

జ్యోతిష్యం చెప్పి నేను బతకలేదు..

ఇలా నాకు ఎన్నో బిజినెస్ లో ఉన్నాయని నేను కేవలం జ్యోతిష్యం చెబుతూ బతకలేదు అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా తన ఆస్తుల గురించి అన్ని విషయాలు బయటపెడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వేణు స్వామి చెప్పినటువంటి ఈ మాటలను బట్టి చూస్తే ఈయన కూడా వందల కోట్ల ఆస్తిపరుడని తెలుస్తుంది.

Manchu Manoj: కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన మౌనిక రెడ్డి… ఇంటినే ఆఫీసుగా మార్చేసామంటూ?

Manchu Manoj: భూమా మౌనిక రెడ్డి నటుడు మంచు మనోజ్ తో కలిసి ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరికి రెండో పెళ్లి కావడం విశేషం. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. మౌనిక పెళ్లి తర్వాత బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టగా మనోజ్ మాత్రం తిరిగి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే మనోజ్ బిజినెస్ గురించి తాజాగా ఒక వార్తను అభిమానులతో పంచుకున్నారు.

ఇటీవల మౌనిక తల్లి కాబోతుంది అంటూ ఒక విషయాన్ని అభిమానులతో పంచుకున్నటువంటి ఈయన తాజాగా మౌనిక కొత్త బిజినెస్ ప్రారంభించింది అంటూ కూడా తెలియజేశారు. గత నాలుగున్నర సంవత్సర కాలం పాటు వీరు ఈ బిజినెస్ ప్రారంభించారని మనోజ్ తెలిపారు.

తమ ఇంటిని ఆఫీసుగా మార్చుకొని కరోనా సమయంలో బొమ్మలు గీయడం వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించడం వంటివి చేస్తామని మనోజ్ తెలిపారు. ఇలా తాము టాయ్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టామని ఈ టాయ్స్ జియో వరల్డ్ రిలయన్స్ సంస్థలతో కలిపి పలు స్టోర్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చామని మనోజ్ వెల్లడించారు.

దైరవ్ వల్లే ఈ ఆలోచన…

కరోనా సమయంలో వివిధ రకాల బొమ్మలను గీస్తూ పిల్లలకు ఎంతో ఇష్టంగా ఉండేలా ఈ బొమ్మలను ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసామని ఈ బొమ్మలు పూర్తిగా మెడ్ ఇన్ ఇండియా టాయ్స్ అంటూ మనోజ్ వెల్లడించారు. అయితే తాము ఈ బిజినెస్ ప్రారంభించాలని ఐడియా మా కొడుకు ద్వారానే వచ్చింది అంటూ వారు ప్రారంభించిన కొత్త బిజినెస్ గురించి ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Vasundhara: బాలయ్య భార్య వసుంధర సహాయం చేస్తే సక్సెస్ అయినట్లేనా… గోల్డెన్ హ్యాండ్ అంటూ?

Vasundhara: నందమూరి నటసింహ బాలకృష్ణ సతీమణి వసుంధర గురించి చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య భార్యగా ఈమె ఎంతో మందికి సుపరిచితమయ్యారు. ఇక బాలకృష్ణ స్టార్ హీరో అయినప్పటికీ ఈమె మాత్రం బయట ఇక్కడ పెద్దగా సందడి చేయరు కేవలం ఫ్యామిలీ ఫంక్షన్లకు మాత్రమే హాజరవుతూ కుటుంబ బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ బాలయ్య విజయానికి దోహదపడ్డారు.

ఇలా కుటుంబ బాధ్యతలను పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ ఓ బాధ్యత గల ఇల్లాలిగాను తల్లిగాను వసుంధర పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే ప్రస్తుతం బాలకృష్ణ సతీమణి వసుంధర గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వసుంధర దేవి హ్యాండ్ గోల్డెన్ హ్యాండ్ అంటూ వైరల్ అవుతుంది.

ఈమె చేతిగుండా ఎవరైనా ఏదైనా బిజినెస్ చేసుకోవాలని లేకపోతే ఏదైనా సహాయం తీసుకున్న వారు అందులో మంచి సక్సెస్ సాధిస్తారని తెలుస్తోంది అందుకే ఈమెను గోల్డెన్ హ్యాండ్ అంటూ అందరూ పొగుడుతూ ఉంటారు ఇక బాలకృష్ణతో సినిమాలు చేసే నిర్మాతలు కూడా ముందుగా ఈమె చేతి నుంచి లక్ష రూపాయలు తీసుకుని సినిమాలను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

Vasundhara: ఏ శుభకార్యం జరిగిన వసుంధర ఉండాల్సిందే…


ఇక ఏ శుభకార్యం జరిగిన తన ఇంట్లో వాళ్ళు ముందుగా వసుంధర చేతనే ఆ కార్యాన్ని మొదలుపెట్టిస్తారట. ఇలా ఈమె చేతి గుండా ఏ కార్యక్రమం మొదలుపెట్టిన కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతాయని అందరూ భావించడం వల్ల ఏ కార్యం జరిగిన ముందుగా వసుంధర ఉండాలని భావిస్తారట ఇక సినిమాల పనుల నిమిత్తం లేదా ఇతర కార్యక్రమాల నిమిత్తం బాలకృష్ణ బయలుదేరి సమయానికి వసుంధర తప్పనిసరిగా ఎదురు వస్తుందని తెలుస్తుంది.